డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిడియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఐర్లాండ్ యువ ఆటగాడు హ్యారీ టెక్టర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. టెక్టర్ అద్భుతమైన ఆటగాడని, భవిష్యత్తులో ఐపీఎల్ కాంట్రక్ట్ పొందే అవకాశం ఉందని పాండ్యా తెలిపాడు.
ఇక వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో 22 ఏళ్ల టెక్టర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్నాడు. పోర్లు, సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా టెక్టర్ కొట్టిన సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.
టెక్టెర్ 33 బంతుల్లో 64 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. "ఈ మ్యాచ్‌లో టెక్టర్ అద్భుతమైన షాట్‌లు ఆడాడు. అతడికి కేవలం 22 ఏళ్లు మాత్రమే. టెక్టర్‌కు చాలా మంచి భవిష్యత్తు ఉంది. అతడు రాబోయే రోజుల్లో ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. ఖచ్చితంగా ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందుతాడు. అతడికి తగినన్ని అవకాశాలు ఇవ్వాలి. అతడికి సరైన గైడెన్స్ ఇవ్వండి. అతడికి ఎల్లప్పడూ మేనేజేమెంట్ సపోర్ట్‌గా ఉంటే.. ఐపీఎల్‌లోనే కాదు, ప్రపంచంలోని అన్ని లీగ్‌లలో కూడా ఆడుతాడు" అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.
ఇండియా వర్సెస్ ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్ స్కోర్లు:
టాస్- భారత్- బౌలింగ్, వర్షం కారణంగా మ్యాచ్ 12 ఓవర్లకు కుదింపు
ఐర్లాండ్ స్కోరు: 108/4 (12)
టీమిండియా స్కోరు: 111/3 (9.2)
విజేత: హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చదవండి:IND Vs IRE 1st T20: ‘గంటకు 208 కి.మీ. వేగం’.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన భువీ?! అక్తర్ ఎవరు?
🎥 That moment when @hardikpandya7 revealed his conversations with Ireland's Harry Tector while handing over a bat after the first #IREvIND T20I. 👍 👍#TeamIndia pic.twitter.com/fB4IG6xHXN
— BCCI (@BCCI) June 27, 2022
Comments
Please login to add a commentAdd a comment