
ఐర్లాండ్‌తో రెండో టీ20కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఫామ్‌లో ఉన్న భారత యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ గాయం కారణంగా రెండో టీ20కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆదివారం డబ్లిన్ వేదికగా జరిగిన తొలి టీ20లో మోకాలి గాయంతో రుతురాజ్ బాధపడ్డాడు. దీంతో అతడు టీమిండియా ఇన్నింగ్స్‌లో పూర్తిగా బ్యాటింగ్ రాలేదు. అతడి స్థానంలో దీపక్ హుడా ఓపెనింగ్ వచ్చాడు.
ఇక మ్యాచ్ అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. గైక్వాడ్ మోకాలి గాయంతో బాదపడుతున్నట్లు హార్ధిక్ తెలిపాడు. ఒక వేళ ఈ మ్యాచ్‌కు గైక్వాడ్ దూరమైతే అతడి స్థానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇరు జట్లు మధ్య రెండో టీ20 డబ్లిన్ వేదికగా మంగళవారం జరగనుంది.
భారత తుది జట్టు( అంచనా)
ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్
చదవండి: IND vs IRE: అందుకే గైక్వాడ్ బ్యాటింగ్‌కు రాలేదు: హార్ధిక్ పాండ్యా
Comments
Please login to add a commentAdd a comment