![World Cup 2023: Prasidh Krishna mauls Ireland on injury return - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/19/krishna.jpg.webp?itok=feFDszYK)
టీమిండియా స్పీడ్ స్టార్ ప్రసిద్ధ్ కృష్ణ అంతర్జాతీయ టీ20ల్లో కూడా తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇప్పటికే వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ కర్ణాటక పేసర్... ఐర్లాండ్‌తో తొలి టీ20తో పొట్టి క్రికెట్‌లో డెబ్యూ చేశాడు. తన తొలి మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టి అందరని ప్రసిద్ధ్ అకట్టుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన ప్రసిద్ధ్.. 32 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించాడు.
తన తొలి ఓవర్‌లో టెక్టర్‌ను ఔట్ చేసిన ప్రసిద్ద్, రెండో ఓవర్‌లో డాక్రెల్‌ను పెవిలియన్‌కు పంపాడు. కాగా గత కాలంగా వెన్ను గాయంతో ప్రసిద్ధ్ కృష్ణ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు కూడా దూరమయ్యాడు. అతడు ఈ మ్యాచ్‌కు దాదాపు ఏడాది పాటు జాతీయ జట్టుకు కూడా దూరంగా ఉన్నాడు.
ఇక గాయం నుంచి కోలుకుని వచ్చిన వెంటనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ప్రసిద్ధ్ కృష్ణపై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఏడాది జరగనున్న ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌లకు బుమ్రా, సిరాజ్, షమీలతో పాటు అదనపు పేసర్‌గా ప్రసిద్ధ్ కృష్ణను కూడా ఎంపిక చేయాలని చాలా మంది సూచిస్తున్నారు. కాగా 27 ఏళ్ల ప్రసిద్ద్‌కు వన్డేల్లో మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు భారత తరపున 14 మ్యాచ్‌లు ఆడిన కృష్ణ.. 5.32 ఏకానమీతో 25 వికెట్టు పడగొట్టాడు.
ఈ క్రమంలోనే అతడిని ఈ మెగా టోర్నీలకు ఎంపిక చేయాలని అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా మరోస్టార్ పేసర్ సిరాజ్ ప్రస్తుతం కాలి మడమ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. విండీస్ పర్యటనకు వెళ్లిన సిరాజ్ మధ్యలోనే అక్కడ నుంచి స్వదేశానికి వచ్చాడు. అతడి ఫిట్‌నెస్‌పై ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్‌డేట్ లేదు. సిరాజ్‌కు ప్రత్నమ్నాయంగా ప్రసిద్ధ్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది.
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. క్రెడిట్ మొత్తం వాళ్లకే! ఇంకా మెరుగవ్వాలి: భారత కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment