WC 2023 Ind Vs Pak: టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమై నెలలు గడుస్తున్నాయి. వెన్ను నొప్పి తిరగబెట్టడంతో గతేడాది సెప్టెంబరు నుంచి బుమ్రాకు విశ్రాంతి అనివార్యమైంది. శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న అతడు.. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నట్లు సమాచారం.
ఇక ఆగష్టు 31 నుంచి ఆసియాకప్-2023, అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్-2023 టోర్నీలు ఆరంభం కానున్న నేపథ్యంలో బుమ్రా పునరాగమనంపై చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 7 నుంచి 9 ఓవర్లు బౌలింగ్ చేయగలుగుతున్న బుమ్రా.. ఆసియా కప్ నాటికి తిరిగివస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.
హింట్ ఇచ్చిన అశ్విన్
అయితే, తాజాగా బుమ్రా రీఎంట్రీపై టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను గందరగోళంలోకి నెట్టేశాయి. ఇంతకీ అశూ ఏమన్నాడంటే..
‘‘ఐసీసీ ఈవెంట్లలో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌లు అంటే విపరీతమైన ఆసక్తి. గతంలోనూ ఎన్నో అద్భుతమైన, ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లను చూశాం. ఈసారి కూడా ఇరు జట్ల మధ్య పోరు బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందనుకుంటున్నా.
హోరాహోరీ తప్పదు
రెండు జట్లలోనూ నాణ్యమైన సీమర్లు ఉన్నారు. కాబట్టి మరోసారి హోరహోరీ పోటీ తప్పకపోవచ్చు. పాక్‌తో మ్యాచ్ నాటికి బుమ్రా, ప్రసిద్ పూర్తిస్తాయి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉంది. ఇక జట్టు కూర్పు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం గానీ.. మ్యాచ్ మాత్రం రసవత్తరంగా ఉంటుందని చెప్పగలను’’ అని అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మేరకు వ్యాఖ్యానించాడు.
కాగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 జరుగనుంది. ఇక ఈ మెగా టోర్నీలో భాగంగా టీమిండియా- పాకిస్తాన్ అక్టోబరు 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. లక్షకు పైగా సీట్ల సామర్థ్యం ఉన్న ఈ స్టేడియం ఈ హైవోల్టేజ్ మ్యాచ్ సందర్భంగా కిక్కిరిసిపోవడం ఖాయం.
చదవండి: ఆర్నెళ్లుగా జట్టుకు దూరం.. ఏకంగా టీమిండియా కెప్టెన్‌గా రీఎంట్రీ!
Comments
Please login to add a commentAdd a comment