Rinku Singh Impresses On Debut Innings In Ind Vs Ire 2nd T20I, Smashes 38 Runs In 21 Balls - Sakshi
Sakshi News home page

#Rinku Singh: టీమిండియాకు నయా ఫినిషర్‌.. వారెవ్వా రింకూ! వీడియో వైరల్‌

Published Mon, Aug 21 2023 8:43 AM | Last Updated on Mon, Aug 21 2023 10:35 AM

Rinku Singh impresses on debut innings in IND vs IRE 2nd T20I - Sakshi

యూపీ క్రికెటర్‌, ఐపీఎల్‌ స్టార్‌ రింకూ సింగ్‌ తన అంతర్జాతీయ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20తో రింకూ సింగ్‌ అరంగేట్రం చేసినప్పటికీ.. బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. కానీ రెండో టీ20లో మాత్రం ఈ సిక్సర్ల కింగ్‌కు ఛాన్స్‌ లభించింది. తనకు వచ్చిన అవకాశాన్ని రింకూ అందిపుచ్చుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో రింకూ సంచలన ప్రదర్శన చేశాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌ వచ్చిన రింకూ..  21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి భారత్‌కు మంచి స్కోర్‌ను అందించాడు. ఆఖరిలో శివమ​్‌ దుబేతో కలిసి ఐర్లాండ్‌ బౌలర్లను ఆట ఆడుకున్నాడు. ఇక అద్బుత ఇన్నింగ్స్‌ ఆడిన రింకూ సింగ్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.

టీమిండియాకు నయా ఫినిషర్‌ దొరికాడని సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా ఐపీఎల్‌లో దుమ్మరేపడంతో సెలక్టర్లు నుంచి రింకూకు పిలుపు వచ్చింది. ఈ ఏడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన రింకూ 149.9 స్ట్రైక్‌రేట్‌తో 474 పరుగులు చేశాడు. ఈ క్రమంలో చైనా వేదికగా జరగనున్న ఆసియాక్రీడలకు కూడా రింకూను సెలక్టర్లు ఎంపిక చేశారు.

ఇక రెండో టీ20లో 33 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. ద్వారా మరో మ్యాచ్‌ మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. సిరీస్‌లోని చివరిదైన మూడో మ్యాచ్‌ ఈనెల 23న ఇదే వేదికపై జరుగుతుంది.
చదవండి: వాటిని పట్టించుకోకూడదు.. అది మాకు పెద్ద తలనొప్పి! ప్రతీ ఒక్కరూ: టీమిండియా కెప్టెన్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement