అంతర్జాతీయ టీ20ల్లో ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ అత్యంత చెత్తరికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌటైన బ్యాటర్‌గా స్టిర్లింగ్ నిలిచాడు. ఇప్పటివరకు 13 సార్లు స్టిర్లింగ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆదివారం డబ్లిన్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో డకౌటైన స్టిర్లింగ్.. ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు ఐర్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ఓబ్రియన్‌ను స్టిర్లింగ్ అధిగమించాడు. ఆ తర్వాతి స్ధానాల్లో జింబాబ్వే క్రికెటర్ చకాబ్వా(11), సౌమ్య సర్కార్(11) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ చేతిలో 33 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో ఐరీష్ కోల్పోయింది. భారత్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఐర్లాండ్ చతికిలపడింది.
లక్ష్యఛేదనలో ఐరీష్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఐర్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ అండీ బల్బిర్నీ (51 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో కెప్టెన్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు తీశారు. ఇక ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 ఆగస్టు 23న జరగనుంది.
చదవండి: IND vs IRE: జైలర్ సినిమా చూశాడు.. దుమ్ము రేపాడు! అట్లుంటది సంజూతో
Comments
Please login to add a commentAdd a comment