
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 11 నెలల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. డబ్లిన్ వేదికగా శుక్రవారం ఐర్లాండ్‌తో జరగనున్న తొలి టీ20లో భారత కెప్టెన్ హోదాలో బుమ్రా బరిలోకి దిగనున్నాడు. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంతో.. యువ భారత జట్టును బుమ్రా ముందుండి నడిపించనున్నాడు.
వెన్ను గాయం, శస్త్ర చికిత్స, పునరావస శిబిరం ఇలా చాన్నాళ్ల తర్వాత ఆడుతున్న టీమిండియా పేస్ గుర్రం బుమ్రా ఎలా రాణిస్తాడని అందరూ వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి టీ20కు విలేకరుల సమావేశంలో పాల్గొన్న జస్ప్రీత్ బుమ్రా తన ఫిట్‌నెస్‌పై కీలక వాఖ్యలు చేశాడు. గాయం నుంచి కోలుకున్నాక తొలి మ్యాచ్ ఆడేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాని బుమ్రా తెలిపాడు.
నా టార్గెట్ వరల్డ్‌కప్..
మళ్లీ భారత జట్టులోకి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నేను 100 శాతం ఫిట్‌నెస్‌తో ఉన్నాను. నేషనల్ క్రికెట్ అకాడమీలో చాలా కష్టపడ్డాను. ఏన్సీఏలో సుదీర్ఘ కాలం పాటు గడిపాను. ప్రస్తుతం అంతమంచిగానే ఉంది. మైదానంలో అడుగుపెట్టేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాను. నెట్స్‌లో బౌలింగ్ చేసేటప్పుడు నా శరీరం మీద పెద్దగా ఒత్తడి లేకుండా చూసుకున్నాను. అంతమాత్రాన నేను వెనక్కు తగ్గినట్లు కాదు.
ఏన్సీఏ నుంచి బయటకు వచ్చాక గుజరాత్ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశాను. అనంతరం చాలా చోట్ల నెట్‌ప్రాక్టీస్ సెషన్స్‌లో కూడా పాల్గొన్నాను. నేను ఇప్పటికే చాలా ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడాను. నా రిహాబిటేషన్ ఎప్పుడూ కూడా టీ20లు ఆడేందుకు ప్రాక్టీస్ చేయలేదు. నా లక్ష్యం ప్రపంచకప్‌లో రాణించడమే. ప్రస్తుతం వరల్డ్‌కప్‌కు సిద్దమవుతున్నాను. నెట్ ప్రాక్టీస్‌లో 10 నుంచి 15 ఓవర్ల వరకు బౌలింగ్ చేస్తున్నాను.
అలా ఎక్కువ బౌలర్లు చేయడం నాకు చాలా ఉపయోగపడుతోంది. కొన్ని సార్లు గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి మనకు కొంచెం ఎక్కవ సమయం పడుతోంది. అటువంటి సమయంలో మనం కాస్త నిరాశ చెందుతాం. కానీ నేను ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు. త్వరగా కోలుకుని ఫీల్డ్‌లోకి రావడం గురించి మాత్రమే ఆలోచించాను అని బుమ్రా ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్ లో పేర్కొన్నాడు.
చదవండి: NZ vs UAE: 5 వికెట్లతో చెలరేగిన న్యూజిలాండ్ కెప్టెన్.. యూఏఈపై ఘన విజయం
The moment we have all been waiting for. @Jaspritbumrah93 like we have always known him. 🔥🔥 #TeamIndia pic.twitter.com/uyIzm2lcI9
— BCCI (@BCCI) August 16, 2023