ఐర్లాండ్ గడ్డపై యువ భారత జట్టు సత్తాచాటింది. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగన రెండో టీ20లో 33 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.
భారత బ్యాటర్లలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (43 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్), సంజూ సామ్సన్ (26 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రింకూ సింగ్ (21 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించారు. ఐరీష్ బౌలర్లలో మెకార్తీ రెండు వికెట్లు, అడైర్, యంగ్, వైట్ తలా వికెట్ సాధించారు. అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐరీష్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగల్గింది.
ఓపెనర్ అండీ బల్బిర్నీ (51 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో కెప్టెన్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు తీశారు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు.
"సిరీస్ సొంతం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు పిచ్ కొంచెం డ్రైగా ఉంది. మిడిల్ ఓవర్లలో వికెట్ కాస్త నెమ్మదించి బ్యాటింగ్‌కు ఇబ్బంది అవుతందని నేను భావించాను. కానీ మా బ్యాటర్లు అదరగొట్టారు. ఈ మ్యాచ్‌లో మా బాయ్స్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవడం కెప్టెన్‌గా చాలా కష్టంగా ఉంది. మాకు అది పెద్ద తలనొప్పిగా మారింది.
ప్రతీ ఒక్కరూ జట్టులో చోటు కోసం అతృతగా ఎదురుచూస్తున్నారు. మేమంతా భారత్ తరఫున ఆడాలని అనుకున్నాం. అయితే మనం నిరంతరం కష్టపడతూ ఉండాలి. ఎదో ఒక రోజు మన శ్రమకు తగ్గ ఫలితం దక్కుతోంది. ఒక ఆటగాడిగా మనపై ఉండే అంచనాలను అస్సలు పట్టించుకోకూడదు. వాటి వల్ల మనం ఒత్తిడికి గురి అవుతాం. వాటిన్నటిని పక్కన పెట్టి జట్టుకు 100 శాతం న్యాయం చేసేందుకు ప్రయత్నించాలని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో బుమ్రా పేర్కొన్నాడు.
చదవండి: Asia Cup 2023: ఆసియా కప్‌కు నేడు భారత జట్టు ఎంపిక.. వారిద్దరిలో ఎవరికీ ఛాన్స్?
Jasprit Bumrah's 💥 spell is 𝘔𝘖𝘖𝘖𝘖𝘋 😍#IREvIND #JioCinema #Sports18 #TeamIndia pic.twitter.com/dixBumib36
— JioCinema (@JioCinema) August 20, 2023
Comments
Please login to add a commentAdd a comment