![Arshdeep Singh overtakes Bumrah to become fastest India pacer to 50 T20wickets - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/21/Untitled-1_0.jpg.webp?itok=ep5bOH0w)
ఫైల్ ఫోటో
టీమిండియా ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంతవేగంగా 50 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్ రికార్డులకెక్కాడు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఆండ్రూ బల్బిర్నీని ఔట్ చేసిన అర్ష్‌దీప్ ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అర్ష్‌దీప్ తన 33వ టీ20 మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు.
అంతకుముందు ఈ రికార్డు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉండేది. బుమ్రా 41 మ్యాచ్‌ల్లో ఈ రికార్డు సాధించాడు. తాజా మ్యాచ్‌తో బుమ్రా రికార్డును అర్ష్‌దీప్ బద్దలు కొట్టాడు. అదే విధంగా ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్ కూడా అర్ష్‌దీప్ కావడం గమానార్హం. అంతకుముందు వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 30 మ్యాచ్‌ల్లోనే 50 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐర్లాండ్‌పై 33 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో యువ భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. సిరీస్‌లోని చివరిదైన మూడో మ్యాచ్ ఈనెల 23న ఇదే వేదికపై జరుగుతుంది.
చదవండి: #Rinku Singh: టీమిండియాకు నయా ఫినిషర్.. వారెవ్వా రింకూ! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment