ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా గెలుపుతో ఆరంభించింది. ఈ సిరీస్‌లో భాగంగా శుక్రవారం డబ్లిన్ వేదికగా ఐరీష్‌తో జరిగిన తొలి టీ20లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 2 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. తద్వారా టీ20ల్లో భారత కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా తొలి విజయాన్ని అందుకున్నాడు. ఐర్లాండ్ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
కెప్టెన్‌గానే కాకుండా బౌలర్‌గా కూడా బుమ్రా అదరగొట్టాడు. దాదాపు 11 నెలల తర్వాత మైదానంలో అడుగుపెట్టిన బుమ్రా.. రీఎంట్రీలోనే ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. రెండు వికెట్లు పడగొట్టి తన పునరాగమాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో టింగ్‌కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.
బారీ మెకార్తీ (33 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించాడు. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్ ఒక్క వికెట్ పడగొట్టాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ వర్షంతో ఆట నిలిచే సమయానికి 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు.
"ఈ మ్యాచ్‌లో నా ప్రదర్శన పట్ల కూడా చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఏన్సీలో చాలా కష్టపడ్డాను. ప్రాక్టీస్ సమయంలో నేను నా రిథమ్‌ను కోల్పోయానని లేదా ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తున్నాని నాకు అనిపించలేదు. ఏన్సీఏ సపోర్ట్ స్టాప్ వల్లే మళ్లీ అదే క్వాలిటీతో నేను బౌలింగ్ చేయగల్గాను. కాబట్టి వారికి ఈ క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. మళ్లీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు నాకేం కొత్తగా అన్పించలేదు. కానీ తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది.
పిచ్‌పై కొంత స్వింగ్ ఉంది. దాన్ని మేము ఉపయెగించుకోవాలని అనుకున్నాం. అదృష్టవశాత్తూ మేమే టాస్ గెలిచాం. అందుకే బౌలింగ్‌ను ఎంచుకున్నాను. మంచు ఎక్కువగా ఉండటం వల్ల కూడా కొంత సహకారం లభించింది. ప్రతీ మ్యాచ్ మనకు కొత్త పాఠాలు నేర్పిస్తోంది. ఐర్లాండ్ కూడా బాగా ఆడింది. ఈ మ్యాచ్‌లో మేము గెలిచినప్పటికీ.. కొన్ని విషయాల్లో ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. మా బాయ్స్ ప్రతీ ఒక్కరూ చాలా కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఈ సిరీస్‌కు వారు బాగా సిద్దమయ్యారు కూడా. ఐపీఎల్ కూడా వాళ్లకు బాగా ఉపయోగపడిందని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో బుమ్రా పేర్కొన్నాడు.
చదవండి: IND vs IRE: ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఊచకోత.. సిక్సర్ల వర్షం! ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment