Ind Vs Ire 2nd T20I: Ireland Scores Highest Total In T20 Format Against India - Sakshi
Sakshi News home page

IND Vs IRE 2nd T20: ఐర్లాండ్‌ అద్భుత పోరాటం.. సరికొత్త రికార్డు! భారత జట్టుపై!

Published Wed, Jun 29 2022 10:05 AM | Last Updated on Wed, Jun 29 2022 11:10 AM

India Vs Ireland 2nd T20: What A Fight Ireland Highest T20 Total Against India - Sakshi

టీమిండియాపై ఐర్లాండ్‌ సరికొత్త రికార్డు(PC: Ireland Cricket)

Highest T20I totals for Ireland: టీమిండియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్‌ అద్భుత ప్రదర్శన కనబరిచింది. పాండ్యా సేన చేతిలో ఓటమి పాలైనా ఆఖరి వరకు పోరాడిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. క్రీడా ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. కాగా టీ20 సిరీస్‌లో భాగంగా డబ్లిన్‌ వేదికగా భారత్‌- ఐర్లాండ్‌ జట్ల మధ్య మంగళవారం(జూన్‌ 28) మ్యాచ్‌ జరిగింది.

ఇందులో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసి.. ఆతిథ్య జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌కు ఓపెనర్లు పాల్‌ స్టిర్లింగ్‌(40), కెప్టెన్‌ ఆండ్రూ బల్బిర్నీ(60) శుభారంభం అందించారు. 

ఇద్దరు బ్యాటర్లు మినహా మిగతా వాళ్లంతా చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. అయితే, ఆఖర్లో డెక్‌రెల్‌ 16 బంతుల్లో 34, మార్క్‌ అడేర్‌ 12 బంతుల్లో 23 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఆఖరి దాకా తీసుకువెళ్లారు. అయితే, టీమిండియా స్పీడ్‌స్టర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ చివరి ఓవర్లో ఒత్తిడి పెంచడంతో 221 పరుగుల వద్ద బల్బిర్నీ బృందం పోరాటం ముగిసింది.

దీంతో ఐర్లాండ్‌కు 4 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. కాగా భారత జట్టుపైన టీ20 ఫార్మాట్‌లో ఐర్లాండ్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అంతేకాదు.. పొట్టి ఫార్మాట్‌లో ప్రత్యర్థి జట్టుపై రెండో భారీ స్కోరు.

టీ20 ఫార్మాట్‌లో ఐర్లాండ్‌ సాధించిన భారీ స్కోర్లు ఇలా:
►అఫ్గనిస్తాన్‌పై- 2013- అబుదాబిలో- 225/7
►టీమిండిమాపై- 2022- డబ్లిన్‌లో- 221/5
►స్కాట్లాండ్‌పై- 2017-దుబాయ్‌లో 211/6
►హాంకాంగ్‌పై- 2019- అల్‌ అమైరెట్‌లో- 208/5
►వెస్టిండీస్‌పై- 2020- సెయింట్‌ జార్జ్‌లో- 208/7
చదవండి: Hardik Pandya- Umran Malik: అద్భుతమైన షాట్లు.. అందుకే ఆఖర్లో ఉమ్రాన్‌ చేతికి బంతి.. ఈ క్రెడిట్‌ మొత్తం వాళ్లదే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement