Rinku Singh can emulate Yuvraj Singh & MS Dhoni as finisher: టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్‌పై మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే ప్రశంసలు కురిపించాడు. మిడిలార్డర్‌లో రాణించగల సత్తా అతడికి ఉందని.. బెస్ట్ ఫినిషర్‌గా ఎదుగుతాడని అంచనా వేశాడు. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాకుండా ఫీల్డింగ్‌లోనూ రింకూ అద్భుతమని కొనియాడాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకూ సింగ్ తాజా ఎడిషన్‌లో అదరగొట్టిన విషయం తెలిసిందే. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన సందర్భాల్లో తానున్నానంటూ ఆదుకున్నాడు. ఫినిషర్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.
సిక్సర్ల రింకూగా..
ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రింకూ ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టడం పదహారో ఎడిషన్ హైలైట్లలో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలో టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడిన రింకూ సింగ్.. ఐర్లాండ్‌లో పర్యటించే భారత టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
డబ్లిన్‌లో ది విలేజ్ మైదానం వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20 సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తాత్కాలిక కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు.
ధోని, యువీ తర్వాత రింకూనే!
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కిరణ్ మోరే స్పందిస్తూ.. మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్ తర్వాత మళ్లీ రింకూ వాళ్లంతటి వాడు కాగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. జియో సినిమా షోలో మాట్లాడుతూ.. ‘‘ రింకూ ఎప్పుడెప్పుడు టీమిండియాలో అరంగేట్రం చేస్తాడా అని ఎదురుచూశాను.
బ్యాటింగ్ ఆర్డర్‌లో ఐదు లేదంటే ఆరో స్థానంలో రింకూ రాణించగలడు. అద్భుతమైన ఫినిషర్‌గా పేరు తెచ్చుకోగలడు. మనం ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్‌లను చూశాం. వాళ్లిద్దరి తర్వాత మళ్లీ అలాంటి ప్లేయర్ రాలేదు.
అద్భుతమైన ఫీల్డర్
ఇప్పుడు రింకూ రూపంలో మంచి ఆప్షన్ దొరికింది. అతడు అద్భుతమైన ఫీల్డర్ కూడా! దేశవాళీ క్రికెట్‌లో ఆడేటపుడు తనని దగ్గరగా గమనించాను. ప్రస్తుతం తన ఆట మరింత మెరుగైంది’’ అని కిరణ్ మోరే చెప్పుకొచ్చాడు. కాగా ఉత్తరప్రదేశ్‌కి చెందిన లెఫ్టాండ్ బ్యాటర్ రింకూ.
ఐరిష్ జట్టుపై అరంగేట్రం చేసిన అతడికి.. వర్షం ఆటంకం కలిగించిన కారణంగా తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక డబ్లిన్ టీ20లో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. టీమిండియా ఐర్లాండ్‌పై 2 పరుగుల తేడాతో గెలుపొంది 1-0తో సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది.
చదవండి: కోహ్లిపై షోయబ్ అక్తర్ వ్యాఖ్యలు.. కొట్టిపారేసిన గంగూలీ! ఏమన్నాడంటే?
ఐర్లాండ్‌తో రెండో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! అతడికి ఛాన్స్
Comments
Please login to add a commentAdd a comment