Kiran More
-
ధోని, యువరాజ్ తర్వాత అలాంటి వాళ్లు రాలేదు.. ఇప్పుడు ఇతడు!
Rinku Singh can emulate Yuvraj Singh & MS Dhoni as finisher: టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్‌పై మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే ప్రశంసలు కురిపించాడు. మిడిలార్డర్లో రాణించగల సత్తా అతడికి ఉందని.. బెస్ట్ ఫినిషర్‌గా ఎదుగుతాడని అంచనా వేశాడు. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాకుండా ఫీల్డింగ్‌లోనూ రింకూ అద్భుతమని కొనియాడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకూ సింగ్ తాజా ఎడిషన్‌లో అదరగొట్టిన విషయం తెలిసిందే. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన సందర్భాల్లో తానున్నానంటూ ఆదుకున్నాడు. ఫినిషర్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. సిక్సర్ల రింకూగా.. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రింకూ ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టడం పదహారో ఎడిషన్ హైలైట్లలో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలో టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడిన రింకూ సింగ్.. ఐర్లాండ్‌లో పర్యటించే భారత టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నాడు. డబ్లిన్‌లో ది విలేజ్ మైదానం వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20 సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. ధోని, యువీ తర్వాత రింకూనే! ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కిరణ్ మోరే స్పందిస్తూ.. మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్ తర్వాత మళ్లీ రింకూ వాళ్లంతటి వాడు కాగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. జియో సినిమా షోలో మాట్లాడుతూ.. ‘‘ రింకూ ఎప్పుడెప్పుడు టీమిండియాలో అరంగేట్రం చేస్తాడా అని ఎదురుచూశాను. బ్యాటింగ్ ఆర్డర్లో ఐదు లేదంటే ఆరో స్థానంలో రింకూ రాణించగలడు. అద్భుతమైన ఫినిషర్‌గా పేరు తెచ్చుకోగలడు. మనం ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్‌లను చూశాం. వాళ్లిద్దరి తర్వాత మళ్లీ అలాంటి ప్లేయర్ రాలేదు. అద్భుతమైన ఫీల్డర్ ఇప్పుడు రింకూ రూపంలో మంచి ఆప్షన్ దొరికింది. అతడు అద్భుతమైన ఫీల్డర్ కూడా! దేశవాళీ క్రికెట్లో ఆడేటపుడు తనని దగ్గరగా గమనించాను. ప్రస్తుతం తన ఆట మరింత మెరుగైంది’’ అని కిరణ్ మోరే చెప్పుకొచ్చాడు. కాగా ఉత్తరప్రదేశ్‌కి చెందిన లెఫ్టాండ్ బ్యాటర్ రింకూ. ఐరిష్ జట్టుపై అరంగేట్రం చేసిన అతడికి.. వర్షం ఆటంకం కలిగించిన కారణంగా తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక డబ్లిన్ టీ20లో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. టీమిండియా ఐర్లాండ్‌పై 2 పరుగుల తేడాతో గెలుపొంది 1-0తో సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. చదవండి: కోహ్లిపై షోయబ్ అక్తర్ వ్యాఖ్యలు.. కొట్టిపారేసిన గంగూలీ! ఏమన్నాడంటే? ఐర్లాండ్‌తో రెండో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! అతడికి ఛాన్స్ -
'టీ20 ప్రపంచకప్‌కు అతడిని ఖచ్చితంగా ఎంపిక చేస్తారు'
ఆసియాకప్-2022కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. అదే విధంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయం కారణంగా ఆసియాకప్‌కు దూరమయ్యారు. అయితే మరో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీని ఆసియా కప్‌కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే అనుభవం ఉన్న మహ్మద్ షమీని ఆసియా కప్‌కు ఎంపిక చేయకపోవడాన్ని భారత మాజీ చీఫ్ సెలక్టర్ కిరణ్ మోర్ తప్పుబట్టాడు. ఆసియా కప్‌కు మహమ్మద్ షమీని ఎంపిక చేసి ఉంటే బాగుండేదని కిరణ్ మోర్ అభిప్రాయపడ్డాడు. కాగా షమీ గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20ల్లో భారత తరపున షమీ ఆడలేదు. అయితే ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతనిధ్యం వహించిన షమీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కాగా ఆసియా కప్‌కు కేవలం మగ్గురు పేసర్లను మాత్రమే సెలక్టర్లు ఎంపిక చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో కిరణ్ మోర్ మాట్లాడుతూ.. "హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకున్న తర్వాత అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం అతడు 140 కి.మీపైగా బౌలింగ్ చేయగలుగుతున్నాడు. ఏ కెప్టెన్‌కైనా అటువంటి ఆటగాడే కావాలి. అతడికి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో రాణించే సత్తా ఉంది. ఇక ఈ మెగా టోర్నీకి షమీని ఎంపిక చేయకపోవడం నాకు ఆశ్యర్యం కలిగించింది. ఆసియా కప్‌కు షమీని ఎంపిక చేయకపోవచ్చు గానీ టీ20 ప్రపంచకప్‌కు ఖచ్చితంగా అతడిని ఎంపిక చేస్తారు. ఎందుకంటే ఇప్పడు ఆసియాకప్‌లో భాగమయ్యే ఆటగాళ్ల అందరికీ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కదు. ఇది కేవలం టీ20 ప్రపంచకప్ సన్నాహాకాలలో భాగం మాత్రమే. షమీ మాత్రం ఖచ్చితంగా ఆస్ట్రేలియాకు వేళ్లే విమానం ఎక్కుతాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఇదే ప్లాన్‌లో ఉంటాడని భావిస్తున్నాను.మరో వైపు గాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా .. టీ20 ప్రపంచకప్ సమయానికి పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధిస్తాడని ఆశిస్తున్నా "అని అతడు పేర్కొన్నాడు. చదవండి: Asia Cup 2022 India Squad: అతడిని ఎంపిక చేయాల్సింది.. నేనే గనుక సెలక్టర్ అయితే..: మాజీ కెప్టెన్ -
'ఆ ఆటగాడు ఇకపై ఫోర్-డి ప్లేయర్'.. టీమిండియా మాజీ క్రికెటర్
ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే ‘ఫోర్డీ ప్లేయర్’గా అభివర్ణించాడు. ''హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఫోర్ డైమెన్షనల్ ప్లేయర్. ఇంతకుముందు అతను బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేసేవాడు...ఇప్పుడు ఈ త్రీడీ ప్లేయర్‌కి కెప్టెన్సీ కూడా తోడైంది. కెప్టెన్సీ కూడా అదరగొడతానని నిరూపించుకున్నాడు. అతనిలో ఎంత టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు...ఐపీఎల్ సీజన్ 15లో గుజరాత్ టైటాన్స్ ఆడిన విధానం అద్భుతం. హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా మారడం, తొలి సీజన్లోనే టైటిల్ గెలవడం, వ్యక్తిగతంగానూ బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించడం... అంత తేలికైన విషయం కాదు'' అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా కెరీర్ మొదటి రోజుల్లో తన అకాడమీలో క్రికెట్ ఆడిన రోజులను కూడా కిరణ్ మోరే గుర్తుచేసుకున్నాడు ''కృనాల్ పాండ్యా నా అకాడమీలో జాయిన్ అయ్యి, క్రికెటర్‌గా రాణించాలని శిక్షణ తీసుకుంటున్నాడు. హార్ధిక్ పాండ్యా, అన్న కోసం ఎప్పుడూ అక్కడికి వచ్చేవాడు...చిన్నతనంలోనే నెట్స్‌లో పరుగెడుతూ క్యాచ్‌లు అందుకునేవాడు. అప్పుడు కృనాల్‌కి తన తమ్ముడిని కూడా ప్రాక్టీస్‌కి తీసుకురమ్మని చెప్పాను. అతని కళ్లల్లో ఆటపై ఇష్టాన్ని అప్పుడే గమనించా... చిన్నప్పటి నుంచే అన్ని మ్యాచుల్లో అదరగొట్టాలనే తపన, తాపత్రయం హార్ధిక్ పాండ్యాలో కనిపించేవి'' అని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక త్రీడీ ప్లేయర్ అనే మాట వినగానే గుర్తొచ్చేది విజయ్ శంకర్. 2019 వన్డే వరల్డ్ కప్ జట్టులో లక్కీగా చోటు దక్కించుకున్న విజయ్ శంకర్ గురించి అప్పటి ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చేసిన కామెంట్లపై అంబటి రాయుడు వేసిన ట్వీట్... చాలా పెద్ద దుమారమే రేపింది...బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. మూడు విభాగాల్లోనూ రాణించే విజయ్ శంకర్, జట్టుకి ‘త్రీడీ ప్లేయర్’గా ఉపయోగపడతాడని ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించడం... వరల్డ్ కప్ మ్యాచులు చూసేందుకు ‘త్రీడీ గ్లాసెస్ ఆర్డర్ చేశానంటూ’ అంబటి రాయుడు ట్వీట్ వేయడం... అప్పట్లో పెద్ద చర్చకే దారి తీసింది. చదవండి: అప్పుడు మొత్తుకున్నారుగా.. ఇప్పుడేం మాట్లాడరా! Rafael Nadal Unknown Facts: ఫుట్‌బాలర్ కావాల్సిన వ్యక్తి.. క్లేకోర్టు రారాజు ఎలా అయ్యాడు -
IPL 2022: పాట పాడిన సచిన్.. వైరల్ వీడియో
Sachin Tendulkar: సంగీతం అంటే చెవి కోసుకునే క్రికెట్ గాడ్ సచిన్ టెండ్కూలర్ తాజాగా ఓ పాట పాడారు. ఇదేదో ప్రొఫెషనల్‌గా రికార్డింగ్ స్టూడియోలో పాడిన పాట కాదండోయ్. సచిన్ తన ఐపీఎల్ సహచరుడు కిరణ్ మోరేతో కలిసి ముంబై నుంచి పూణే వెళ్తుండగా దారిలో ట్రాఫిక్ జామ్ కావడంతో సరదాగా ఓ పాటను అందుకున్నాడు. తనకెంతో ఇష్టమైన హేమంత్ కుమార్ పాడిన పాపులర్ మరాఠి పాటను ఆయన హమ్ చేశాడు. సచిన్‌తో మోరే కూడా గొంతు కలిపాడు. వీరిద్దరు పాటను ఎంజాయ్ చేస్తూ రకరకాల హావభావాలను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను సచినే స్వయంగా ట్విటర్లో పోస్ట్ చేయగా, ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. Stuck in traffic while heading to Pune. Thought of listening to this lovely song! 🎶 मी डोलकर डोलकर डोलकर दर्याचा राजा… पुण्याला करतोय ये जा… pic.twitter.com/jyCYKqjoPK — Sachin Tendulkar (@sachin_rt) April 5, 2022 కాగా, సచిన్‌కు సంగీతం అంటే విపరీతమైన పిచ్చి అన్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా బాలీవుడ్, మరాఠీ పాటలకు సచిన్ చెవి కోసుకుంటాడు. సచిన్ గతంలో సోనూ నిగమ్‌తో కలిసి ఓ పాటను కూడా పాడాడు. క్రికెట్ గాడ్ ప్రస్తుతం ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా సచిన్ మెంటార్షిప్లో ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ ఓటములను చవిచూసింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ జట్ల చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. ముంబై తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 9న ఆర్సీబీతో తలపడనుంది. చదవండి: టీమిండియా మాజీ కెప్టెన్ తలలో మెటల్ ప్లేట్.. 60 ఏళ్ల తర్వాత తొలగింపు! -
ధోనీ కోసం గంగూలీని పది రోజులు బతిమాలాను..
ముంబై: టీమిండియా సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కోసం నాటి ఈస్ట్ జోన్ సారధి సౌరవ్ గంగూలీని పది రోజుల పాటు బతిమాలానని భారత మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ కిరణ్ మోరే వెల్లడించాడు. 2003-04 దులీప్ ట్రోఫీ ఫైనల్లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దీప్‌దాస్ గుప్తా బదులు ధోనీని ఆడించేందుకు చాలా ప్రయాసపడ్డానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంగూలీ, దీప్‌దాస్ గుప్తా ఇద్దరు బెంగాల్‌కు చెందిన వారే అని తెలిసి కూడా గంగూలీని ఒప్పించేందుకు ప్రయత్నించానని, చివరకు గంగూలీ ఒప్పుకోవడం.. ధోనీ జట్టులోకి రావడం చకచకా జరిగిపోయాయని పేర్కొన్నాడు. అంతకుముందు ఓ స్నేహితుడు చెప్పడంతో ధోనీ ఆటను చూడటానికి తాను ప్రత్యక్షంగా వెళ్లానని, ఆ మ్యాచ్‌లో జట్టు మొత్తం 170 పరుగులు చేస్తే, ధోని ఒక్కడే 130 పరుగులు సాధించాడని మోరే తెలిపాడు. ఆ మ్యాచ్‌లో బౌలర్లపై ధోనీ విరుచుకుపడిన తీరు చూసి చాలా ముచ్చటేసిందని, అందుకే అతన్ని దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున ఎలాగైనా ఆడించాలని కంకణం కట్టుకున్నాని వివరించాడు. ఎట్టకేలకు గంగూలీని ఒప్పించాక ఫైనల్స్ బరిలో దిగిన ధోనీ తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 47 బంతుల్లోనే 60 పరుగులు చేసి సత్తా చాటాడన్నాడు. దీంతో ఆ వెంటనే ధోనీని ఇండియా ఎ తరఫున కెన్యాలో జరిగిన ట్రయాంగిల్ టోర్నీకి పంపించామని, ఆ టోర్నీయే అతని కెరీర్‌ను మలుపు తిప్పిందని మోరే చెప్పుకొచ్చాడు. అందులో ధోనీ ఏకంగా 600 పరుగులు సాధించి, జాతీయ జట్టులోకి దూసుకొచ్చాడని వెల్లడించాడు. ఆ సమయంలో (2003 వన్డే ప్రపంచకప్ తర్వాత) టీమిండియాకు రెగ్యులర్ వికెట్ కీపర్ లేకపోవడం ధోనీకి మరింత కలిసొచ్చిందని, అందివచ్చిన అవకాశాలకు అతను ఒడిసి పట్టుకుని భారత దేశం గర్వించే స్థాయికి ఎదిగాడంటూ ధోనీపై మోరే ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా, తాను అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయడానికి నాటి చీఫ్ సెలక్టర్ మోరే చాలా సహయపడ్డాడని ధోనీ కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించాడు. చదవండి: ఐసీసీ టోర్నీల్లో కీలక మార్పులు.. -
టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ గా రోహిత్ శర్మ..?
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు కెప్టెన్‌గా నియమించాలని వస్తున్న వాదనలకు భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే మద్దతు పలికాడు. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ గా రోహిత్ శర్మ ను ఎంపిక చేస్తే ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని వ్యాఖ్యానించాడు. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీనే ఏదో ఒక రోజు స్వయంగా తన సారథ్య బాధ్యతలను రోహిత్‌తో పంచుకోవడానికి ముందుకు వస్తాడని ఈ మాజీ వికెట్ కీపర్ చెప్పుకొచ్చాడు. స్ప్లిట్ కెప్టెన్సీ పై గతకొంతకాలంగా వస్తున్న వార్తల నేపథ్యంలో కిరణ్ మోరే ఈ మేరకు స్పందించాడు. ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ కు ఉంటే తప్పేంటని ప్రశ్నించిన మోరే.. బీసీసీఐ తన సూచనలను పరిగణలోకి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో కోహ్లీ కెప్టెన్సీ తో పోలిస్తే.. రోహిత్ సారథ్యం మెరుగ్గా ఉంటుందని, ఇందుకు ఐపీఎల్ లో రోహిత్ సాధించిన విజయాలే నిదర్శనమని పేర్కొన్నాడు. టెస్టుల్లో కోహ్లీ.. వన్డే, టీ20లకు రోహిత్ కెప్టెన్లుగా ఉండాలని క్రీడా పండితులు సైతం అభిప్రాయపడుతున్నారని చెప్పుకొచ్చాడు. కోహ్లీ.. కెప్టెన్సీ బాధ్యతల్ని రోహిత్‌తో పంచుకుంటే భవిష్యత్ తరాలకు బలమైన సందేశాన్ని ఇచ్చినట్లుంటుందని అభిప్రాయపడ్డాడు. టాలెంట్ కు కొదవ లేని భారత్ లాంటి దేశంలో ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ అనే పంథా సెట్ అవుతుందని తెలిపాడు. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం కోహ్లీ సేన యూకే పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. చదవండి: ఎన్ని అర్హతలున్నా ఏం లాభం.. అతనుండగా జట్టులోకి కష్టమే -
త్వరలోనే ఆయన జట్టుతో చేరతారు: ముంబై ఇండియన్స్
ముంబై: భారత క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్, ముంబై ఇండియన్స్ జట్టు వికెట్ కీపింగ్ కోచ్ కిరణ్ మోరే కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. 58 ఏళ్ల మోరే ఈనెల 6న కోవిడ్–19 బారిన పడ్డారు. దాంతో ఆయన ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన మూడు వరుస ఆర్టీ–పీసీఆర్ పరీక్షలలో నెగెటివ్ ఫలితం వచ్చింది. త్వరలోనే మోరే జట్టుతో మోరే చేరుతాడని ముంబై ఇండియన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. Official Statement: Kiran More has recovered from COVID-19 and has completed medically-supervised isolation. More has tested negative in three RT-PCR tests.#MumbaiIndians #MI #OneFamily (1/2) pic.twitter.com/c7I7PwAIa5 — Mumbai Indians (@mipaltan) April 21, 2021 -
ఊపిరి పీల్చుకున్న ముంబై.. ఆటగాళ్లందరికీ కరోనా నెగిటివ్
చెన్నై: తమ జట్టు ఆటగాళ్లు, సహయ సిబ్బందికి కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. కొద్ది గంటల క్రితం ఆ జట్టు వికెట్ కీపింగ్ కన్సల్టెంట్ కిరణ్ మోరేకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన ఫ్రాంఛైజీ, మంగళవారం ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేసి మరీ అందరికీ పరీక్షలు నిర్వహించింది. జట్టు సభ్యులు బస చేస్తున్న హోటల్లోనే కిరణ్ మోరే కూడా ఉండటంతో తొలుత ముంబై యాజమాన్యం ఆందోళన చెందింది. అయితే కోవిడ్ పరీక్షల్లో అందరికీ నెగిటివ్ రావడంతో ఆనందం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా, ఏప్రిల్ 9న జరుగనున్న ఐపీఎల్ 14వ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీకొంటుంది. చదవండి: అతను క్రికెటర్ కాకపోయుంటే టెర్రరిస్ట్ అయ్యేవాడు.. -
ముంబై ఇండియన్స్‌కు షాక్.. కీలక సభ్యుడికి కరోనా
ముంబై: టీమిండియా మాజీ వికెట్ కీపర్, ముంబై ఇండియన్స్ వికెట్ కీపింగ్ సలహాదారు కిరణ్ మోరేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయన వైరస్ బారిన పడినట్లు తేలిందని ముంబై ఇండియన్స్ యాజమాన్యం వెల్లడించింది. మోరేకు ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ, నిబంధనల ప్రకారం ఆయనను ఐసోలేషన్‌కు తరలించి, వైద్యుల పర్యవేక్షణలో చికిత్సనందిస్తున్నామని పేర్కొంది. మోరే.. ముంబై ఇండియన్స్‌కు వికెట్ కీపింగ్ కన్సల్టెంట్‌గా, ప్రతిభాన్వేషకుడిగా వ్యవహరిస్తున్నారు. కాగా, బీసీసీఐ రూపొందించిన ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుందని ముంబై యాజమాన్యం పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బుసలు కొడుతున్న వేళ అభిమానులు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 40వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ అమల్లో ఉన్నా వైరస్ మాత్రం చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ముగ్గురు వాంఖడే మైదాన సిబ్బంది కరోనా బారినపడటంతో ముంబై ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. చదవండి: వాంఖడేలో చాపకింద నీరులా కరోనా.. తాజాగా మరో ముగ్గురికి -
‘అప్పుడు సుశాంత్‌కు ఎన్నో గాయాలయ్యాయి’
ముంబై: పని పట్ల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకుందని టీమిండియా మాజీ ఆటగాడు, సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కిరణ్ మోరె అన్నారు. ధోని బయోపిక్ కోసం సుశాంత్ తన వద్ద 9 నెలల కఠోర సాధన చేశాడని తెలిపారు. ధోని తరహా ఆటతీరు కనబర్చే ప్రయత్నంలో అతను ఎన్నో గాయాలపాలయ్యాడని చెప్పారు. ఆక్రమంలోనే పక్కటెముకల గాయంతో 10 రోజులపాటు కోచింగ్‌కు దూరమయ్యాడని మోరె గుర్తు చేసుకున్నారు. కఠోర సాధనతో కష్టసాధ్యమైన కీపింగ్ నేర్చుకున్నాడని, ఫాస్ట్ బౌలర్లు, బౌలింగ్ మెషీన్ వేసే బంతుల్ని ఎదుర్కొనే క్రమంలో అతని పోరాటపటిమకు తాను ముగ్ధుణ్ని అయ్యానన్నారు. (చదవండి: 'కావాలనే సుశాంత్‌ని 7 సినిమాల్లో తప్పించారు') ‘నెట్స్‌లో సాధన చేసేటప్పుడు సుశాంత్‌తో మాటలకన్నా.. ఒకరకమైన తిట్లతోనే గడిచిపోయేది. అయినప్పటికీ అతను నాపై ఎప్పుడూ అసహనం వ్యక్తం చేయలేదు. ఆటపైనే దృష్టి పెట్టేవాడు. తెల్లవారు జామున, సాయంత్రం వేళల్లో, ఇటి దగ్గరా సుశాంత్ ప్రాక్టీస్ చేసి.. ఆ విశేషాలను నాతో పంచుకునేవాడు. మొత్తంమీద కోచింగ్ పూర్తయ్యేటప్పటికీ మా మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొంది. ధోని బయోపిక్‌కోసం అతని నిబద్థత చూసి.. ఆ సినిమా చక్కగా వస్తుందనుకున్నా. దాంతోపాటు సుశాంత్ కెరీర్లో ఇది అద్భుతమైన పాత్ర అవుందని, నటుడిగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడని భావించా. ధోని తర్వాత హెలికాప్టర్ షాట్స్‌తో అదరగొట్టిన రెండో వ్యక్తి సుశాంతే. అదే విషయం తనదో చెప్పా. తను పొంగిపోయాడు. నెలన్నర కష్టపడి అతను హెలికాప్టర్ షాట్స్ ఆడటం నేర్చుకున్నాడు. అనంతరం అలవోకగా.. రోజూ 100 షాట్లు ఆడాడు. మూడు నాలుగు గంటల సెషన్లో 300 నుంచి 400 బంతుల్ని సుశాంత్ ఎదుర్కొనేవాడు. అలసటే లేకుండా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యేవాడు. తనను ఔట్ చెయ్యాలని నెట్ బౌలర్లకు చాలెంజ్ చేసేవాడు’అని కిరణ్ మోరె సుశాంత్‌తో సాగిన కోచింగ్ విశేషాలను నెమరేసుకున్నారు. కాగా, ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: ఇక్కడ ఎవరూ ఎవరినీ పట్టించుకోరు: సైఫ్ అలీఖాన్) -
కిరణ్ మోరే కొత్త ఇన్నింగ్స్
న్యూఢిల్లీ: భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే కొత్త ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. యూఎస్ఏ క్రికెట్ జట్టుకు తాత్కాలిక కోచ్‌గా మోరే నియమించబడ్డాడు. త్వరలోనే పబుడు దసనాయకే స్థానంలో మోరే కోచింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. శ్రీలంక, కెనడా జట్లకు ప్రాతినిథ్య వహించిన 49 ఏళ్ల దసనాయకే కోచింగ్ కాంట్రాక్ట్ మార్చి 2019 వరకూ ఉండగా, దాన్ని ఈ ఏడాది డిసెంబర్ వరకూ పొడిగించారు. కాగా, యూఎస్ఏ క్రికెట్ బోర్డుతో దసనాయకేకు విభేదాలు రావడంతో తన కోచింగ్ పదవికి రాజీనామా చేశారు. దాంతో మోరేను తాత్కాలిక కోచ్‌గా నియమిస్తూ యూఎస్ఏ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. భారత వికెట్ కీపర్‌గా, సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా పని చేసిన అనుభవం ఉన్న మోరేను యూఎస్ఏ క్రికెట్ కోచ్‌గా ఎంపిక చేసింది. భారత్ తరఫున 49 టెస్టు మ్యాచ్‌లు, 94 వన్డేలు ఆడిన మోరే.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు వికెట్ కీపింగ్ కన్సల్టెంట్‌గా కూడా పని చేశారు. ఇదిలా ఉంచితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో యూఎస్ఏ జట్టుకు వన్డే హోదా వచ్చిన సంగతి తెలిసిందే. వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజిన్-2లో హాంకాంగ్‌పై 84 పరుగుల తేడాతో గెలవడంతో యూఎస్ఏకు వన్డే హోదా లభించింది. అంతకుముందు 2004లో యూఎస్ఏ ఒకసారి వన్డే హోదాను దక్కించుకున్నా ఆ తర్వాత దాన్ని కోల్పోయింది. -
మోరెతో నా ఆట మారె!
రిషభ్ పంత్... భారత క్రికెట్ యువ తార. అన్ని స్థాయిల్లో అరంగేట్రం నుంచే అదరగొడుతూ మెరుపు షాట్లకు మారు పేరుగా నిలిచాడు. దూకుడైన ఆటతో మహేంద్ర సింగ్ ధోనికి దీటైన వారసుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే, బ్యాట్స్‌మన్‌గా సంచలనాలు సృష్టించినా అతడి వికెట్ కీపింగ్ సామర్థ్యంపై మాత్రం నిన్న మొన్నటిదాకా అనుమానాలున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనతో వాటిని కూడా పటాపంచలు చేశాడు. ఈ మెరుగుదల వెనుక భారత మాజీ కీపర్ కిరణ్ మోరె సూచనలు, సలహాలు ఉన్నాయని చెబుతున్నాడతడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు వెల్లడించాడు. న్యూఢిల్లీ: సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ నుంచి గట్టి పోటీని తట్టుకుని ప్రపంచ కప్ బెర్తును దాదాపు ఖాయం చేసుకున్నాడు రిషభ్ పంత్. బ్యాటింగ్ సామర్థ్యంరీత్యా వంక పెట్టలేకున్నా, కీపింగ్‌లో లోపాలతో అతడి ఎంపికపై అనుమానాలున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ పర్యటనలో ఎక్కువగా బైస్ రావడంతో పంత్‌పై విమర్శలు మొదలయ్యాయి. కానీ, ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చేసరికి అతడు ఆ సమస్యను అధిగమించాడు. ఆడిలైడ్ టెస్టులో ప్రపంచ రికార్డు 11 క్యాచ్‌లను సమం చేయడంతో పాటు సిరీస్‌లో 20 క్యాచ్‌లు పట్టి ప్రశంసలు పొందాడు. ఈ రెండు అనుభవాల మధ్య జాతీయ క్రికెట్ అకాడమీలో కిరణ్ మోరె వద్దకు వెళ్లడం తన కీపింగ్ సామర్థ్యాన్ని మెరుగుపర్చిందని పంత్ అంటున్నాడు. ఇంకా ఏం చెప్పాడో అతడి మాటల్లోనే... ఇంగ్లండ్‌లో ఇబ్బంది ఇందుకే... ఎరుపు రంగు డ్యూక్ బంతి ఇరువైపులా స్వింగ్ అయ్యే ఇంగ్లండ్‌లో కీపింగ్ చేయడం భిన్న అనుభవం. వికెట్ దాటిన తర్వాత కూడా బంతి గాలిలో సుడులు తిరుగుతుంది. ఈ పర్యటన తర్వాత నేను జాతీయ క్రికెట్ అకాడమీలో మోరె వద్దకు వెళ్లా. చేతులను ఏ దిశలో ఉంచాలి? శరీరాన్ని ఎలా కదిలించాలి? వంటి ప్రత్యేక అంశాలపై దృష్టిపెట్టా. ప్రతి కీపర్‌కు తమదైన శైలి ఉంటుంది. నా వరకు వచ్చేసరికి అందులో కొంత సర్దుబాటు చేసుకున్నా. తగిన ప్రతిఫలం దక్కింది. చిన్న వయసులోనే అవకాశాలపై... ఏదైనా నేర్చుకోవడానికి, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి చిన్న వయసులోనే జట్టులోకి రావడం మేలు చేస్తుంది. కొత్త విషయాలు తెలు సుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఇంగ్లండ్‌లో చివరి టెస్టులో సెంచరీ చేయడం నా ఆత్మవిశ్వాసాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. అప్పటి నుంచి కొన్ని అంశాల్లో నన్ను నేను మెరుగుపర్చుకోవడంపై దృష్టిపెట్టా. ఇంగ్లండ్‌తో మొదలైన ‘నేర్చుకోవడం అనే ఆలోచన’ ఆస్ట్రేలియాలో మేలు చేసింది. అంచనాల ఒత్తిడి గురించి... భారత్‌కు ఆడినా, ఐపీఎల్లో ఆడినా అంచనాల ఒత్తిడి, అభద్రతా భావం ఒకే తీరుగా ఉంటుంది. వాటిపై ఆలోచిస్తూ కూర్చుంటే ఆటపై దృష్టిపెట్టలేం. అలాంటివి అధిగమించి రాణిస్తేనే ఓ ఆటగాడిగా మనమేంటో తెలుస్తుంది. ఏ మ్యాచ్ అయినా ఒకటే అని భావించాలి. బ్యాటింగ్ స్థానం.. ఢిల్లీ ఫ్రాంచైజీపై... ఒక బ్యాట్స్‌మన్‌గా నేనెప్పుడూ టాపార్డర్‌లో ఆడేందుకే మొగ్గుచూపుతా. అయినా, ఇక్కడ జట్టు సమతూకం ముఖ్యం. ఈసారి మా ఢిల్లీ ఫ్రాంచైజీ పేరు, జెర్సీ మారింది. కొత్త ఆటగాళ్లు వచ్చారు. ఇది అనుభవం, యువతరం కలగలిసిన కూర్పు. రాబోయే సీజన్ మాకు అద్భుతంగా సాగుతుందని భావిస్తున్నా. సోషల్ మీడియా ప్రభావం... వ్యక్తిగత జీవితాలను హరించే సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలి. మీ గురించి ఎన్నో ప్రశంసలు రావొచ్చు. ఇదే సమయంలో ప్రతికూల వ్యాఖ్యల్ని భరించే శక్తి మీలో ఉండాలి. ఈ ప్రభావంలో పడకుండా నన్ను ఉన్నత స్థాయికి చేర్చే క్రికెట్ గురించి ఆలోచిస్తా. ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూనే ఎలా ముందుకెళ్లాలనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అంశం. నేను చేసినవి చిన్న మార్పులే... నేనిచ్చినవి చిన్న సలహాలే. పంత్ కీపింగ్‌లో ఎక్కువగా పక్కకు జరుగుతుంటాడు. అలా కాకుండా ఛాతీ భాగాన్ని విశాలం చేసి ఉంచాలని సూచించా. క్యాచ్‌లను ఒడిసి పట్టడంతో పాటు, గాయాలకు గురికాకుండా చేతి వేళ్లను బౌలర్ వైపు కాకుండా నేలను చూసేలా ఉంచాలని చెప్పా. –కిరణ్ మోరె, భారత మాజీ వికెట్ కీపర్ -
కరణ్ షోతో పాండ్యా చాలా డిస్టర్బ్ అయ్యాడు
సాక్షి, ముంబై: ‘కాఫీ విత్ కరణ్ షో’లో తాను మాట్లాడిన మాటలు వివాదానికి దారితీయడంతో హార్దిక్ పాండ్యా చాలా డిస్టర్బ్ అయ్యాడని అతడి మెంటర్, మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ కిరణ్ మోరే తెలిపారు. ఆ షోలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాడని వివరించాడు. ప్రస్తుతం పాండ్యా టీమిండియా కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడని మోరే తెలిపాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్ మోరే మాట్లాడుతూ.. ‘ఆ షోలో పాండ్యా కంట్రోల్ తప్పి ఏదేదో మాట్లాడాడు. కానీ పాండ్యా స్వభావం, వ్యక్తిత్వం అటువంటిది కాదు. పొరపాట్లనేవి ప్రతీ ఒక్కరి జీవితంలో సహజం. దీనిపై ఇప్పటికే బీసీసీఐకి, మహిళలకు క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం అన్ని వివాదాలు తొలిగిపోయాయి. పాండ్యాకు ఇప్పుడు క్రికెట్ గురించి తప్ప వేరే ధ్యాసే లేదు. ప్రపంచకప్‌లో టీమిండియాకు పాండ్యా అదనపు బలం. కేఎల్ రాహుల్ కూడా తన పొరపాట్లను సరిదిద్దుకున్నాడు. జట్టులోకి త్వరలోనే తిరిగొస్తాడని భావిస్తున్నా (తొలిసారి బరిలో పాండ్యా బ్రదర్స్!) ప్రపంచకప్‌లో పాండ్యా తప్పకుండా ఉంటాడు ఇంగ్లండ్ వేల్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ ప్రపంచకప్‌లో టీమిండియానే ఫేవరేట్. అయితే భారత ప్రపంచకప్ జట్టులో పాండ్యా తప్పకుండా స్థానాన్ని సంపాదిస్తాడు. పాండ్యాతోనే టీమ్ బ్యాలెన్స్‌గా ఉంటుంది. డెత్ ఓవర్లలో బ్యాటింగ్ చేయడంలో పాండ్యా దిట్ట, అదేవిధంగా బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. దీంతో ప్రపంచకప్‌లో టీమిండియా ప్రధాన ఆటగాడు పాండ్యా అనడంలో ఎలాంటి సందేహం లేదు.’అంటూ కిరణ్ మోరే పాండ్యా గురించి పలు విషయాలు వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. కాఫీ విత్ కరణ్ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లు వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఇద్దరి ఆటగాళ్లను ఆస్ట్రేలియా పర్యటన నుంచి మొదట్లో అకస్మాత్తుగా స్వదేశానికి పిలిపించి విచారణ చేపట్టారు. తొలుత క్రికెట్ పరిపాలక కమిటీ (సీవోఏ) చీఫ్ వినోద్ రాయ్ రెండు మ్యాచ్‌ల నిషేధంతో సరిపెట్టాలని భావించినా, మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ న్యాయ సలహాకు పట్టుబట్టారు. దీంతో వీరిద్దరిపై నిరవధిక నిషేధాన్ని విధించారు. కొన్ని రోజుల నాటకీయ పరిణామాల అనంతరం పాండ్యా, రాహుల్‌లపై సీవోఏ నిషేధాన్ని ఎత్తివేసింది. (పాండ్యా.. బంతిని కరణ్ అనుకున్నావా?) -
'అప్పటివరకు ధోని కొనసాగాలి'
మెగా ఈవెంట్ నేపథ్యంలో టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్ పై ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడు క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరుగుతోంది. చాంపియన్స్ ట్రోఫీ 2017, జూన్ లో జరగనుంది. అయితే 2019 వన్డే ప్రపంచ కప్ వరకు ధోని కొనసాగాలని మాజీ క్రికెటర్లు కోరుకుంటున్నారు. 'వచ్చే వన్డే వరల్డ్ కప్ నాటికి ధోని వయసు 38 ఏళ్లు. ఈ రోజుల్లో క్రికెట్ లో కొనసాగడానికి ఇదేమంత పెద్ద వయసు కాదు. పాకిస్థాన్ ఆటగాళ్లు యూనిస్ ఖాన్, మిస్బా-వుల్-హక్.. 40 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడుతున్నారు. అయితే 2019 వరకు ఫిట్ నెస్ కాపాడుకుంటే ధోని కూడా కొనసాగవచ్చు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోని ఇప్పుడే వైదొలగాల్సిన అవసరం కనబడడం లేద'ని మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. ఇదే అభిప్రాయాన్ని మాజీ కెప్టెన్ రవిశాస్త్రి వ్యక్తం చేశాడు. 'కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లా ధోని కూడా గొప్ప ఆటగాడు. 2019 వరకు అతడు ఆడాలి. అతడి లాంటి ఆటగాడు సమీప భవిష్యత్తులో లభించడం కష్టం. తనదైన ఆటతీరుతో సమకాలిన క్రికెట్ లో ధోని చెరగని ముద్ర వేశాడ'ని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఫిట్ నెస్ చాలా కీలకమని, ఫిట్ గా ఉంటే 2019 వరకు ధోని కొనసాగుతాడని మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే అన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత ధోని రిటైర్ అవుతాడా, వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు కొనసాగుతాడా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. -
‘కోహ్లి అద్భుతమైన కెప్టెన్’
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా టెస్టు టీమ్.. న్యూజిలాండ్ ను ఓడించి సిరీస్ గెలుస్తుందని మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె అన్నాడు. కోహ్లి సమర్థ నాయకుడని కొనియాడాడు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు కాన్పూర్ లో రేపటి నుంచి ప్రారంభం కానుంది. ‘మన జట్టుకు ఇది మంచి అవకాశం. టీమిండియా సిరీస్ గెలుస్తుంది. మనది బలమైన జట్టు. సొంతగడ్డపై భారత్ బాగా ఆడుతుంది. మన టీమ్ కు మంచి కెప్టెన్ కోహ్లి ఉన్నాడు. అతడి దూకుడు, సామర్థ్యంతో క్లిష్ట సమయాల్లో జట్టును గట్టెక్కిస్తాడు. కోహ్లి అద్భుతమైన కెప్టెన్. జట్టును ముందుండి నడిపిస్తాడు. అతడు తెలివైన ఆటగాడు. వరల్డ్ క్లాస్ బ్యాట్స్ మన్. అతడి నాయకత్వంలో టెస్టు టీమ్ బాగా ఆడుతుంద’ని కిరణ్ మోరె విశ్వాసం వ్యక్తం చేశాడు. స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నాడు.