‘కోహ్లి అద్భుతమైన కెప్టెన్’ | India will beat Kiwis under Kohli's captaincy: Kiran More | Sakshi
Sakshi News home page

‘కోహ్లి అద్భుతమైన కెప్టెన్’

Published Wed, Sep 21 2016 2:30 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

‘కోహ్లి అద్భుతమైన కెప్టెన్’

‘కోహ్లి అద్భుతమైన కెప్టెన్’

న్యూఢిల్లీ: విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా టెస్టు టీమ్.. న్యూజిలాండ్ ను ఓడించి సిరీస్ గెలుస్తుందని మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె అన్నాడు. కోహ్లి సమర్థ నాయకుడని కొనియాడాడు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు కాన్పూర్ లో రేపటి నుంచి ప్రారంభం కానుంది.

‘మన జట్టుకు ఇది మంచి అవకాశం. టీమిండియా సిరీస్ గెలుస్తుంది. మనది బలమైన జట్టు. సొంతగడ్డపై భారత్ బాగా ఆడుతుంది. మన టీమ్ కు మంచి కెప్టెన్ కోహ్లి ఉన్నాడు. అతడి దూకుడు, సామర్థ్యంతో క్లిష్ట సమయాల్లో జట్టును గట్టెక్కిస్తాడు. కోహ్లి అద్భుతమైన కెప్టెన్. జట్టును ముందుండి నడిపిస్తాడు. అతడు తెలివైన ఆటగాడు. వరల్డ్ క్లాస్ బ్యాట్స్ మన్. అతడి నాయకత్వంలో టెస్టు టీమ్ బాగా ఆడుతుంద’ని కిరణ్ మోరె విశ్వాసం వ్యక్తం చేశాడు. స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement