ఊపిరి పీల్చుకున్న ముంబై.. ఆటగాళ్లందరికీ కరోనా నెగిటివ్‌ | IPL 2021: Mumbai Indians Players And Support Staff Gets Negative COVID-19 Results After Kiran More Tested Positive | Sakshi
Sakshi News home page

ఊపిరి పీల్చుకున్న ముంబై.. ఆటగాళ్లందరికీ కరోనా నెగిటివ్‌

Published Tue, Apr 6 2021 7:13 PM | Last Updated on Tue, Apr 6 2021 7:47 PM

IPL 2021: Mumbai Indians Players And Support Staff Gets Negative COVID-19 Results After Kiran More Tested Positive - Sakshi

చెన్నై: తమ జట్టు ఆటగాళ్లు, సహయ సిబ్బందికి కోవిడ్‌ పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. కొద్ది గంటల క్రితం ఆ జట్టు వికెట్‌ కీపింగ్‌ కన్సల్టెంట్‌ కిరణ్‌ మోరేకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన ఫ్రాంఛైజీ, మంగళవారం ట్రైనింగ్‌ సెషన్‌ను రద్దు చేసి మరీ అందరికీ పరీక్షలు నిర్వహించింది.

జట్టు సభ్యులు బస చేస్తున్న హోటల్‌లోనే కిరణ్‌ మోరే కూడా ఉండటంతో తొలుత ముంబై యాజమాన్యం ఆందోళన చెందింది. అయితే కోవిడ్‌ పరీక్షల్లో అందరికీ నెగిటివ్‌ రావడంతో ఆనందం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా, ఏప్రిల్‌ 9న జరుగనున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును ఢీకొం‍టుంది. 
చదవండి: అతను క్రికెటర్‌ కాకపోయుంటే టెర్రరిస్ట్‌ అయ్యేవాడు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement