ఆసియాకప్-2022కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. అదే విధంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయం కారణంగా ఆసియాకప్‌కు దూరమయ్యారు. అయితే మరో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీని ఆసియా కప్‌కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు.
అయితే అనుభవం ఉన్న మహ్మద్ షమీని ఆసియా కప్‌కు ఎంపిక చేయకపోవడాన్ని భారత మాజీ చీఫ్ సెలక్టర్ కిరణ్ మోర్ తప్పుబట్టాడు. ఆసియా కప్‌కు మహమ్మద్ షమీని ఎంపిక చేసి ఉంటే బాగుండేదని కిరణ్ మోర్ అభిప్రాయపడ్డాడు. కాగా షమీ గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20ల్లో భారత తరపున షమీ ఆడలేదు. అయితే ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతనిధ్యం వహించిన షమీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కాగా ఆసియా కప్‌కు కేవలం మగ్గురు పేసర్లను మాత్రమే సెలక్టర్లు ఎంపిక చేయడం గమనార్హం.
ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో కిరణ్ మోర్ మాట్లాడుతూ.. "హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకున్న తర్వాత అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం అతడు 140 కి.మీపైగా బౌలింగ్ చేయగలుగుతున్నాడు. ఏ కెప్టెన్‌కైనా అటువంటి ఆటగాడే కావాలి. అతడికి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో రాణించే సత్తా ఉంది. ఇక ఈ మెగా టోర్నీకి షమీని ఎంపిక చేయకపోవడం నాకు ఆశ్యర్యం కలిగించింది. ఆసియా కప్‌కు షమీని ఎంపిక చేయకపోవచ్చు గానీ టీ20 ప్రపంచకప్‌కు ఖచ్చితంగా అతడిని ఎంపిక చేస్తారు.
ఎందుకంటే ఇప్పడు ఆసియాకప్‌లో భాగమయ్యే ఆటగాళ్ల అందరికీ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కదు. ఇది కేవలం టీ20 ప్రపంచకప్ సన్నాహాకాలలో భాగం మాత్రమే. షమీ మాత్రం ఖచ్చితంగా ఆస్ట్రేలియాకు వేళ్లే విమానం ఎక్కుతాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఇదే ప్లాన్‌లో ఉంటాడని భావిస్తున్నాను.మరో వైపు గాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా .. టీ20 ప్రపంచకప్ సమయానికి పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధిస్తాడని ఆశిస్తున్నా "అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: Asia Cup 2022 India Squad: అతడిని ఎంపిక చేయాల్సింది.. నేనే గనుక సెలక్టర్ అయితే..: మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment