IPL 2022: Sachin Tendulkar Sings Hemant Kumar Famous Marathi Song While Stuck In Traffic, Viral Video - Sakshi
Sakshi News home page

IPL 2022: పాట పాడిన సచిన్‌.. వైరల్ వీడియో

Published Thu, Apr 7 2022 9:06 PM | Last Updated on Fri, Apr 8 2022 9:02 AM

IPL 2022: Sachin Tendulkar Sings Hemant Kumar Famous Marathi Song While Stuck In Traffic - Sakshi

Sachin Tendulkar: సంగీతం అంటే చెవి కోసుకునే క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండ్కూలర్‌ తాజాగా ఓ పాట​ పాడారు. ఇదేదో ప్రొఫెషనల్‌గా రికార్డింగ్‌ స్టూడియోలో పాడిన పాట కాదండోయ్‌. సచిన్‌ తన ఐపీఎల్‌ సహచరుడు కిరణ్‌ మోరేతో కలిసి ముంబై నుంచి పూణే వెళ్తుండగా దారిలో ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో సరదాగా ఓ పాటను అందుకున్నాడు. తనకెంతో ఇష్టమైన హేమంత్ కుమార్‌ పాడిన పాపులర్‌ మరాఠి పాటను ఆయన హమ్‌ చేశాడు. సచిన్‌తో మోరే కూడా గొంతు కలిపాడు. వీరిద్దరు పాటను ఎంజాయ్‌ చేస్తూ రకరకాల హావభావాలను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను సచినే స్వయంగా ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా, ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. 


కాగా, సచిన్‌కు సంగీతం అంటే విపరీతమైన పిచ్చి అన్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా బాలీవుడ్‌, మరాఠీ పాటలకు సచిన్‌ చెవి కోసుకుంటాడు. సచిన్‌ గతంలో సోనూ నిగమ్‌తో కలిసి ఓ పాటను కూడా పాడాడు.  క్రికెట్‌ గాడ్‌ ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా సచిన్‌ మెంటార్షిప్‌లో ముంబై ఇండియన్స్‌ హ్యాట్రిక్‌ ఓటములను చవిచూసింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ జట్ల చేతిలో ముంబై ఇండియన్స్‌ ఓటమిపాలైంది. ముంబై తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్‌ 9న ఆర్సీబీతో తలపడనుంది.  
చదవండి: టీమిండియా మాజీ కెప్టెన్‌ తలలో మెటల్‌ ప్లేట్‌.. 60 ఏళ్ల తర్వాత తొలగింపు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement