
Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ గర్ల్‌ఫ్రెండ్ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అప్పటికే కేఎల్ రాహుల్ సెంచరీ దిశగా నడుస్తున్నాడు. అయితే మనీష్ పాండే 38 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ మురుగన్ అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. స్టోయినిస్ కొట్టిన లాంగాన్ సిక్సర్ 104 మీటర్ల ఎత్తులో వెళ్లింది. ఆ తర్వాత తన ప్రేయసి కూర్చున్న వైపు తిరిగిన స్టోయినిస్ చిరునవ్వుతో థంబ్స్ అప్ చేస్తూ.. ''ఈ సిక్సర్ నీకే అంకితం'' అన్నట్లుగా సిగ్నల్ ఇచ్చాడు. ఇది చూసిన స్టోయినిస్ గర్ల్‌ఫ్రెండ్ ఒక క్యూట్ స్మైల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Courtesy: IPL Twitter
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 199 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ సీజన్‌లో తొలి సెంచరీతో మెరిశాడు. ఐపీఎల్ కెరీర్‌లో వందో మ్యాచ్ ఆడుతున్న రాహుల్.. కేవలం 56 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతకాన్ని పూర్తి చేశాడు.ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లి తర్వాత కెప్టెన్‌గా రెండు, అంతకంటే ఎక్కువ సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా రాహుల్ రికార్డుల్లోకెక్కాడు.
What a shot!! pic.twitter.com/b4XWOKTqcY
— Cricketupdates (@Cricupdates2022) April 16, 2022
Comments
Please login to add a commentAdd a comment