ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఇరు జట్ల మధ్య డబ్లిన్ వేదికగా శుక్రవారం జరగనుంది. ఈ సిరీస్‌తో టీమిండియా పేస్‌గుర్రం జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. దాదాపు 11 నెలల తర్వాత బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు.
అంతేకాకుండా ఐరీష్ టూర్‌లో బుమ్రానే భారత జట్టు సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ పర్యటనకు సీనియర్లందరికీ విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. ఐపీఎల్-2023లో అదరగొట్టిన రింకూ సింగ్, జితేశ్ శర్మ, తిలక్ వర్మ, జైశ్వాల్ వంటి యువ ఆటగాళ్లకు చోటుకల్పించారు. అయితే తిలక్ వర్మ, జైశ్వాల్ ఇప్పటికే విండీస్ టూర్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టగా.. రింకూ సింగ్, జితేశ్ శర్మ తమ అరంగేట్రం కోసం అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సిరీస్ కోసం బుమ్రా సారథ్యంలోని భారత జట్టు బుధవారం ఐర్లాండ్‌కు చేరుకుంది.
తొలిసారి..
భారత జట్టుకు ఎంపికైన రింకూ సింగ్, జితేశ్ శర్మలు తొలిసారి బిజినెస్ క్లాస్ విమానంలో ప్రయాణించారు. ఈ క్రమంలో వీరిద్దరూ తమ తొలి అంతర్జాతీయ పర్యటనకు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్‌చేసింది. "నాకు చాలా సంతోషంగా ఉంది. టీమిండియాకు ఆడాలనేది ప్రతీ ఒక్క ఆటగాడి కల. నేను నా గదిలోకి వెళ్లి.. నా పేరు, 35 నంబర్ ముద్రించిన జెర్సీని చూడగానే భావోద్వేగానికి లోనయ్యా.
ఈ రోజు కోసమే నేను కష్టపడ్డాను. నేను భారత జట్టు ఎంపికైనప్పుడు నా స్నేహితులతో నోయిడాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. వెంటనే మా అమ్మకు ఫోన్ చేశాను. నేను ఈ స్ధాయిలో ఉన్నానంటే అందుకు ఒక కారణం మా అమ్మ కూడా. ఆమెకు నాకు ఎంతో సపోర్ట్‌గా ఉంటుంది. భారత్ తరపున ఆడాలన్నది నా ఒక్కడి కలే కాదు మా అమ్మది కూడా. ఇప్పడు మా ఇద్దరి కల నిజమైందని" బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో రింకూ చెప్పుకొచ్చాడు.
అదే విధంగా జితేష్ శర్మ మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే ఈ సంతోషంలో నాకు మాటలు కూడా రావడం లేదు. భారత క్రికెట్ జట్టుతో కలిపి విదేశాల్లో పర్యటించడం గొప్ప అనుభవం. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం అనేది మనకు లభించిన గౌరవం. అంతేకాకుండా బాధ్యత కూడా మన సత్తా చూపించుకునేందుకు ఇదొక మంచి అవకాశం. నాకు ఆడేందుకు అవకాశం లభిస్తే 100 శాతం ఎఫక్ట్ భారత్‌ను గెలిపించేందుకు పెడతాను "అని పేర్కొన్నాడు.
చదవండి: BAN vs NZ: బంగ్లాదేశ్ పర్యటనకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు.. 10 ఏళ్ల తర్వాత
Comments
Please login to add a commentAdd a comment