వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్‌పై కన్నేసింది. ఆదివారం డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరగనున్న రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఇప్పటికే తొలి టీ20లో గెలుపొందిన టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక రెండో టీ20లో టీమిండియా ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో విఫలమైన అర్ష్‌దీప్ సింగ్‌పై వేటు వేయాలని జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అతడి స్ధానంలో మరో పేసర్ అవేష్ ఖాన్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తొలి మ్యాచ్‌లో అర్ష్‌దీప్ తన నాలుగు ఓవర్ల కోటాలో 35 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక బ్యాటింగ్‌లో టీమిండియా ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ జితీష్ శర్మకు అవకాశం ఇవ్వాలనకుంటే శాంసన్‌ను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది.
మరోవైపు ఐర్లాండ్ కూడా తమ జట్టులో ఒకే ఒక మార్పు చేయనున్నట్లు సమాచారం. ఆల్‌రౌండర్ డాక్రెల్ స్ధానంలో గ్రెత్ డెలానీకి ఛాన్స్ ఇవ్వాలని ఐరీష్ జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇక ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది.
తుది జట్లు(అంచనా)
పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్,గ్రెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్
భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రవి బిష్ణోయ్
చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు.. ఎవరూ ఊహించని ఆటగాడు ఎంట్రీ!
Comments
Please login to add a commentAdd a comment