![Rohit Sharma Needs 3 Runs To Create History against ireland](/styles/webp/s3/article_images/2024/06/4/rohit-sharma.jpg.webp?itok=djvRipw2)
టీ20 వరల్డ్‌కప్-2024లో తొలి మ్యాచ్‌కు టీమిండియా సన్నద్దమవుతోంది. జూన్ 5న న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఐరీష్‌ను చిత్తు చేసి మెగా ఈవెంట్‌ను ఘనంగా ఆరంభించాలని టీమిండియా భావిస్తోంది.
ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో 3 పరుగులు సాధిస్తే.. టీ20ల్లో ఐర్లాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా రికార్డులెక్కుతాడు.
ఇప్పటివరకు ఐర్లాండ్‌పై రోహిత్ శర్మ 3 మ్యాచ్‌లు ఆడి 149 పరుగులు చేశాడు. కాగా ప్రస్తుతం ఈ రికార్డు టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడా పేరిట ఉంది. దీపక్ హుడా ఇప్పటివరకు ఐర్లాండ్‌పై 2 మ్యాచ్‌లు ఆడి 151 పరుగులు చేశాడు.
భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment