సంజయ్ మంజ్రేకర్(PC: Sanjay Manjrekar Twitter)
India Vs Ireland T20I Series: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టులో దీపక్ హుడాను ఎంపిక చేయడం మంచి నిర్ణయమని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. లోయర్ ఆర్డర్‌లో భారత్‌కు ఇప్పుడు హుడా వంటి ఆటగాడి అవసరం ఎంతగానో ఉందని పేర్కొన్నాడు. ఐపీఎల్-2022లో అద్భుతంగా ఆకట్టుకున్న అతడు.. టీమిండియా తరఫున ఏ మేరకు రాణిస్తాడో చూడాలని ఉందన్నాడు.
అద్భుతంగా రాణించినా!
కాగా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు దీపక్ హుడా. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆడాడు. ఇక ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ 14 ఇన్నింగ్స్‌లో కలిపి 451 పరుగులు చేశాడు.
ఇందులో నాలుగు అర్థ శతకాలు ఉన్నాయి. మిడిలార్డర్‌లో కీలకంగా వ్యవహరించి లక్నో ప్లే ఆఫ్స్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో హుడాకు జాతీయ జట్టులో చోటు దక్కుతుందని భావించినా మొండిచేయి ఎదురైంది. అయితే, కీలక ఆటగాళ్లు లేకుండా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని టీమ్‌లో అతడు స్థానం సంపాదించుకున్నాడు.
భారత్‌కు ఇలాంటి ఆటగాడి అవసరం ఉంది!
ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఐర్లాండ్‌తో సిరీస్‌లో హుడా రాణిస్తాడనే అనుకుంటున్నా. ఐపీఎల్‌లో దీపక్ హుడా తన అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. నిజానికి లోయర్ ఆర్డర్‌లో వచ్చి ఆకట్టుకునే ప్రదర్శన చేయడం కష్టం.
అయితే, హుడా ఐపీఎల్‌లో ఈ కఠినతరమైన పనిని ఎంతో సులువుగా చేశాడు. టీమిండియాకు ఇప్పుడు ఇలాంటి ఆటగాడి అవసరం ఎంతగానో ఉంది. ఐపీఎల్‌లోనే కాదు భారత్ తరఫున కూడా అతడు అత్యుత్తమంగా రాణిస్తాడు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా జూన్ 26, 28 తేదీల్లో భారత్- ఐర్లాండ్ మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
చదవండి: ఒకప్పుడు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్.. ఇప్పుడు పాకిస్తాన్‌లో సెకండ్ హ్యాండ్ దుస్తులు అమ్ముతూ! డబ్బు మీద ఆశలేదు కానీ!
India Vs Ireland T20I Series Details: ఐర్లాండ్‌తో భారత్ టీ 20 సిరీస్.. ఇరు జట్లు, షెడ్యూల్.. పూర్తి వివరాలు!
Comments
Please login to add a commentAdd a comment