ఐపీఎల్-2024 ఫీవర్ ముగియగానే పొట్టి ప్రపంచకప్ రూపంలో క్రికెట్ ప్రేమికులకు మరో మెగా సమరం కనువిందు చేయనుంది. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీ ఆరంభం కానుంది.
ఇక హాట్ ఫేవరెట్లలో ఒకటైన టీమిండియా జూన్ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో ఈ ఐసీసీ ఈవెంట్‌లో ప్రయాణం ఆరంభించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు ప్రపంచకప్‌లో తలపడే భారత జట్టు గురించి తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యాకు నో
ఈ క్రమంలో రోహిత్ శర్మకు జోడీగా విరాట్ కోహ్లి టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తే బాగుంటుందని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన ఎంపికతో ముందుకు వచ్చాడు.
తన జట్టులో రన్‌మెషీన్ విరాట్ కోహ్లికి చోటివ్వకపోగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బదులు ఊహించని పేరును తెరమీదకు తెచ్చాడు. కాగా ఆర్సీబీ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లి ఇప్పటి వరకు ఆడిన 9 ఇన్నింగ్స్‌లో కలిపి 430 పరుగులు సాధించాడు.
అత్యధిక పరుగుల వీరుడి జాబితాలో టాప్‌లో కొనసాగుతూ.. ప్రస్తుతానికి ఆరెంజ్ క్యాప్ తన వద్ద పెట్టుకున్నాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా విఫలమవుతున్నా టీమిండియా వైస్ కెప్టెన్ హోదాలో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.
ఊహించని ఆటగాళ్లకు చోటు
ఇక పాండ్యాతో ఇప్పటికే శివం దూబే పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ ఎంపిక చేసుకున్న జట్టులో కోహ్లితో పాటు హార్దిక్ పాండ్యా, శివం దూబేలకు చోటు దక్కలేదు. అంతేకాదు అనూహ్యంగా హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యాను మంజ్రేకర్ ఎంపిక చేసుకున్నాడు.
అదే విధంగా లక్నో యువ సంచలనం, స్పీడ్‌గన్ మయాంక్ యాదవ్‌కు కూడా తన జట్టులో స్థానం కల్పించాడు. కాగా లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్య వహిస్తున్న లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా.. ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్‌లో 58 పరుగులు చేశాడు. అదే విధంగా.. 8 మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు.
టీ20 ప్రపంచకప్-2024కు సంజయ్ మంజ్రేకర్ ఎంచుకున్న భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, కృనాల్ పాండ్యా.
చదవండి: T20 WC 2024: దాదాపు 900 రన్స్ చేశా.. నాకు చోటు ఇవ్వకపోతే: గిల్ కామెంట్స్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment