Barry McCarthy scripts a unique record in T20Is against India - Sakshi
Sakshi News home page

IND vs IRE: ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఊచకోత.. సిక్సర్ల వర్షం! ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా

Published Sat, Aug 19 2023 7:37 AM | Last Updated on Sat, Aug 19 2023 8:39 AM

Barry McCarthy scripts a unique record in T20Is versus India - Sakshi

ఐర్లాండ్‌తో మూడో టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. డబ్లిన్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో  2 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన భారత పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా అదరగొట్టాడు.

తన నాలుగు ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బారీ మెకార్తీ (33 బంతుల్లో 51 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించాడు. 

భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిధ్‌ కృష్ణ, రవి బిష్ణోయ్‌ తలా 2 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు​. . తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ వర్షంతో ఆట నిలిచే సమయానికి 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. వర్షంతో ఆట నిలిచే సమయానికి డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో భారత విజయ సమీకరణం 45 పరుగులుగా ఉంది. ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో డీఎల్‌ఎస్‌ ప్రకారం టీమిండియాను విజేతగా ప్రకటించారు.

బారీ మెకార్తీ అరుదైన రికార్డు..
ఐర్లాండ్‌ ఆటగాడు బారీ మెకార్తీ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో టీమిండియాపై ఎనిమిది లేదా అంతకంటే తక్కువ స్ధానాల్లో బ్యాటింగ్‌ వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన క్రికెటర్‌గా మెకార్తీ రికార్డులెక్కాడు. భారత్‌తో జరిగిన తొలి టీ20లో ఎనిమిది స్ధానంలో బ్యాటింగ్‌ వచ్చి 51 పరుగులు చేసిన మెకార్తీ.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించకున్నాడు.

అంతకుముందు ఈ రికార్డు సౌతాఫ్రికా కేశవ్‌ మహారాజ్ పేరిట ఉండేది. గతేడాది తిరువనంతపురం వేదికగా జరిగిన టీ20లో మహారాజ్(41) పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో ఈ రికార్డును మెకార్తీ బ్రేక్‌ చేశాడు.
చదవండిInd Vs Ire: ఐర్లాండ్‌తో తొలి టీ20.. అరుదైన దృశ్యం! ఆ ఐదుగురు భారత ఆటగాళ్లు ఒకేసారి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement