Ireland vs India, 1st T20I- Rare Thing: ఐర్లాండ్‌తో తొలి టీ20 సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా తరఫున ఏకంగా ఐదుగురు లెఫ్టాండ్ బ్యాటర్లు మైదానంలో దిగారు. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలోని యువ జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య శుక్రవారం(ఆగష్టు 18) డబ్లిన్‌లోని ది విలేజ్ వేదికగా తొలి టీ20 మొదలైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ బుమ్రా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే పేస్ దళ నాయకుడు బుమ్రా(2 వికెట్లు)తో పాటు అరంగేట్ర(టీ20) ఫాస్ట్‌బౌలర్ ప్రసిద్ కృష్ణ(2), అర్ష్‌దీప్ సింగ్(1) చెలరేగారు.
స్కోరెంతంటే!
స్పిన్నర్ రవి బిష్ణోయి(2) కూడా వీరికి తోడయ్యాడు. అయితే, ఆరంభంలో తడబడ్డా.. తర్వాత కుదురుకున్న ఐరిష్ జట్టు మెరుగైన స్కోరే చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు సాధించింది.
ఇదిలా ఉంటే.. ఆతిథ్య ఐర్లాండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించిన పర్యాటక టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అత్యంత అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఐదుగురు లెఫ్టాండ్ బ్యాటర్లు ఫీల్డింగ్ చేయడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
ఆ ఐదుగురు ఎవరంటే!
ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన రింకూ సింగ్‌తో పాటు తుది జట్టులో చోటు దక్కించుకున్న ఓపెనర్ యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, శివం దూబే, వాషింగ్టన్ సుందర్.. ఇలా వీళ్లంతా ఎడమచేతి వాటం కలిగిన బ్యాటర్లే కావడం విశేషంగా నిలిచింది.
ఐర్లాండ్‌తో తొలి టీ20లో భారత తుది జట్టు:
జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్.
చదవండి: Ind vs Ire: అయ్యో బుమ్రా.. అసలే ఏడాది తర్వాత రీఎంట్రీ!
What a start from the #TeamIndia captain 🤩
— JioCinema (@JioCinema) August 18, 2023
Bumrah back to what he does best 💥#IREvIND #JioCinema #Sports18 pic.twitter.com/IryoviTKGo
Comments
Please login to add a commentAdd a comment