
ఐపీఎల్‌లో అదరగొట్టి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యూపీ క్రికెటర్ రింకూ సింగ్.. తన తొలి ఇన్నింగ్స్‌లోనే అదరగొట్టాడు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో రింకూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన రింకూ.. 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి సత్తాచాటాడు.
శివబ్ దుబేతో కలిసి టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో రింకూ కీలక పాత్రపోషించాడు. ఆఖరి రెండు ఓవర్లలో ఐరీష్ బౌలర్లకు రింకూ చుక్కలు చూపించాడు. కాగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20తో రింకూ సింగ్ అరంగేట్రం చేసినప్పటికీ.. బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
కానీ రెండో టీ20లో మాత్రం ఈ కేకేఆర్ సంచలనానికి ఛాన్స్ దక్కింది. అతడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనకు గాను రింకూకు మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక తన ప్రదర్శన పట్ల మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ స్పందించాడు.
"నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐపీఎల్‌లో ఏమి చేశానో ఇక్కడ కూడా అదే అదే చేయడానికి ప్రయత్నించాను. నేను చాలా కాన్పడెన్స్‌తో ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగా. ఎటువంటి ఒత్తిడికి గురవ్వకుండా ఉండటానికి ప్రయత్నించాను. నేను గత 10 ఏళ్లగా క్రికెట్ ఆడుతున్నాను. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ రోజు దక్కింది. నా తొలి ఇన్నింగ్స్‌లో లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రావడం ఆనందంగా ఉందంటూ" రింకూ పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో పేర్కొన్నాడు.
చదవండి: వాటిని పట్టించుకోకూడదు.. అది మాకు పెద్ద తలనొప్పి! ప్రతీ ఒక్కరూ: టీమిండియా కెప్టెన్
Achi finish ki chinta kyu jab crease par barkaraar ho Rinku 🤩! 🔥#IREvIND #JioCinema #Sports18 #RinkuSingh #TeamIndia pic.twitter.com/QPwvmPPPxK
— JioCinema (@JioCinema) August 20, 2023
Comments
Please login to add a commentAdd a comment