
సూపర్ స్టార్ రజనీకాంత్‌కి టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. కేరళలో పుట్టిన సంజూకు చిన్నతనం నుంచే రజనీకాంత్ అంటే ఎంతో ఇష్టం. తలైవాను కలవాలన్న తన చిన్నప్పటి కోరికను సంజూ 28ఏళ్ల వయస్సులో నేరవేర్చుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో రజినీని తన నివాసంలో కలిశాడు.
ఇక తాజాగా మరోసారి సూపర్ స్టార్‌పై తన అభిమానాన్ని సంజూ చాటుకున్నాడు. శాంసన్ ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న విషయం విధితమే. ఈ క్రమంలో రజినీ కాంత్ నటించిన 'జైలర్' సినిమాను శనివారం ఐర్లాండ్‌లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. దీనికి సంజూ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
ఈ విషయాన్ని ఐర్లాండ్-భారత్ రెండో టీ20 సందర్భంగా కామేంటేటర్ నైల్ ఓబ్రియన్ వెల్లడించాడు. ఇటీవలే సంజు తన అభిమాన నటుడి సినిమాను చూశాడాని ఓబ్రియన్ చెప్పుకొచ్చాడు. ఇక ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన జైలర్ సినిమా.. రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు రూ.500 కోట్ల మేర గ్రాస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐర్లాండ్‌పై 33 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సంజూ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 40 పరుగులు చేశాడు.
అయితే వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో విఫలమైన సంజూ.. ఐర్లాండ్‌పై అదరగొట్టడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. జైలర్ సినిమా చూసిన తర్వాత సంజూ రెచ్చిపోయాడని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరోవైపు నేడు ఆసియాకప్ జట్టు ప్రకటన నేపథ్యంలో సంజూకు చోటు దక్కాలని కోరుకుంటున్నారు.
చదవండి: #Rinku Singh: టీమిండియాకు నయా ఫినిషర్.. వారెవ్వా రింకూ! వీడియో వైరల్
Just IN : Indian Cricketer #SanjuSamson WATCHED superstar #Rajinikanth's #Jailer movie.
— Manobala Vijayabalan (@ManobalaV) August 20, 2023
||#JailerHits500cr | #ShivaRajkumar |#Mohanlal ||pic.twitter.com/M59u7eizgu