స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టీ20ల్లో తొలిసారి భారత జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్దమయ్యాడు. శుక్రవారం నుంచి ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో యువ భారత జట్టును బుమ్రా నడిపించనున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత బుమ్రాకు ఇదే తొలి సిరీస్ కావడం గమనార్హం. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో బుమ్రాకు జట్టు సారథ్య బాధ్యతలు సెలక్టర్లు అప్పగించారు.
అతడికి డిప్యూటీగా యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ వ్యవహరించనున్నాడు. ఇక ఐరీష్‌కు సిరీస్‌కు ఈ ఐపీఎల్‌లో అదరగొట్టిన రింకూ సింగ్, శివమ్ దుబే, జితేష్ శర్మకు చోటు దక్కింది. అదే విధంగా విండీస్ పర్యటనలో అకట్టుకున్న యశస్వీ జైశ్వాల్, తిలక్ వర్మ కూడా ఐర్లాండ్ టూర్‌లో ఉన్నారు. మరోవైపు పేసర్ ప్రసిద్ద్ కృష్ణ కూడా ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
సంజూపై వేటు..
ఇక మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 డబ్లిన్ వేదికగా ఆగస్టు 18న జరగనుంది. ఈ మ్యాచ్‌తో యువ క్రికెటర్ రింకూ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. రింకూ ఈ ఏడాది ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో రింకూ సిక్సర్ల వర్షం కురిపించాడు.
అదే విధంగా ఆల్‌రౌండర్ శివమ్ దుబే నాలుగేళ్ల తర్వాత మళ్లీ భారత్ తరపున ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దుబే చివరగా 2019లో భారత తరపున ఆడాడు. మళ్లీ ఇప్పుడు ఐర్లాండ్ పర్యటనతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అతడు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉండడంతో తొలి టీ20కు చోటు దక్కడం ఖాయమన్పిస్తోంది.
మరోవైపు విండీస్‌తో టీ20 సిరీస్‌లో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను తొలి టీ20కు పక్కన పెట్టాలని జట్టుమెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న యువ వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తొలి టీ20కు భారత తుది జట్టు(అంచనా): రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ,శివం దూబే, రింకూ సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్,రవి బిష్ణోయ్,షాబాజ్ అహ్మద్,అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా
చదవండి: #Matheesha Pathirana: 'చాలా గ్రేట్.. ధోని నుంచి చాలా నేర్చుకున్నా'
Comments
Please login to add a commentAdd a comment