టీమిండియాతో టీ20 సిరీస్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని ఐర్లాండ్ ఆల్‌రౌండర్ గ్రెత్ డెన్లీ తెలిపాడు. భారత జట్టులో భువనేశ్వర్ కుమార్, సుర్యకూమార్ యాదవ్ వంటి అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని డెన్లీ పేర్కొన్నాడు.ఐర్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. తొలి టీ20 ఆదివారం(జూన్ 26) డబ్లిన్ వేదికగా జరగనుంది.
ఇక ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ కారణంగా కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ, బుమ్రా, షమీ వంటి సీనియర్ ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరమయ్యారు. దీంతో తొలి సారి ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా భారత జట్టుకు సారథ్యం వహించబోతున్నాడు. అయితే సీనియర్ ఆటగాళ్లు లేనప్పటికీ.. కిషన్, శాంసన్, గైక్వాడ్, హార్షల్ పటేల్ వంటి యువ ఆటగాళ్లు ఉన్న భారత్‌ను ఓడించడం ఐర్లాండ్‌కు అంత సులభం కాదు.
"సూర్యకుమార్ యాదవ్‌కి బౌలింగ్ చేయాలని ఉంది. అతడు 360 డిగ్రీల కోణంలోనూ షాట్స్ ఆడగల అధ్బుతమైన ఆటగాడు. అదే విధంగా భువనేశ్వర్ కుమార్ ప్రపంచ టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. టీ20ల్లో అతడు చాలా తక్కువ ఎకానమీ రేటును కలిగి ఉన్నాడు. మేము ముందు ముందు ఆడేబోయే మ్యాచ్‌లకు ఈ సిరీస్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుది. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుతో ఆడడం ఎంతో సంతోషంగా ఉంది. టీ20ల్లో నెం1 జట్టుకు వ్యతేరేకంగా ఆడడం మాకు కఠినమైన సవాలు. అయితే ఈ రెండు మ్యాచ్‌లలోనూ భారత్‌కు గట్టి పోటీ ఇస్తామని" డెన్లీ పేర్కొన్నాడు
చదవండి: ENG vs NZ: సెంచరీతో చెలరేగిన బెయిర్‌స్టో.. ఇంగ్లండ్ స్కోర్: 264/6
Comments
Please login to add a commentAdd a comment