
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో బుమ్రా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా వెస్టిండీస్ టూర్ తర్వాత భారత జట్టు ఐర్లాండ్ పర్యటన వెళ్లనుంది.
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆతిథ్య ఐర్లాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్ ఆగస్టులో జరగనుంది. అయితే ఈ ఏడాది ఆగస్టు ఆఖరిలో ఆసియాకప్ జరగనుండడంతో.. భారత ద్వితీయ శ్రేణి జట్టు వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ జట్టుతో పాటు బుమ్రాను కూడా ఐర్లాండ్‌కు పంపాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
కాగా వెన్ను గాయం నుంచి కోలుకున్న బుమ్రా.. ప్రస్తుతం నెషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. అతడిని వన్డే వరల్డ్‌కప్ సమయానికి సిద్దం చేసే పనిలో భారత జట్టు మెనెజ్‌మెంట్ పడింది. ఈ క్రమంలో వీలైనంత వేగంగా బరిలోకి దించాలని మెనెజ్‌మెంట్ భావిస్తోంది. కాగా గతేడాది సెప్టెంబర్ నుంచి బుమ్రా జట్టుకు దూరంగా ఉన్నాడు.
చదవండి: #Cheteshwar Pujara: వందకు పైగా టెస్టులు ఆడాడు.. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా?