Team Management
-
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. టీమిండియా స్టార్ బౌలర్ రీ ఎంట్రీ!
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో బుమ్రా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా వెస్టిండీస్ టూర్ తర్వాత భారత జట్టు ఐర్లాండ్ పర్యటన వెళ్లనుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆతిథ్య ఐర్లాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్ ఆగస్టులో జరగనుంది. అయితే ఈ ఏడాది ఆగస్టు ఆఖరిలో ఆసియాకప్ జరగనుండడంతో.. భారత ద్వితీయ శ్రేణి జట్టు వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ జట్టుతో పాటు బుమ్రాను కూడా ఐర్లాండ్‌కు పంపాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా వెన్ను గాయం నుంచి కోలుకున్న బుమ్రా.. ప్రస్తుతం నెషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. అతడిని వన్డే వరల్డ్‌కప్ సమయానికి సిద్దం చేసే పనిలో భారత జట్టు మెనెజ్‌మెంట్ పడింది. ఈ క్రమంలో వీలైనంత వేగంగా బరిలోకి దించాలని మెనెజ్‌మెంట్ భావిస్తోంది. కాగా గతేడాది సెప్టెంబర్ నుంచి బుమ్రా జట్టుకు దూరంగా ఉన్నాడు. చదవండి: #Cheteshwar Pujara: వందకు పైగా టెస్టులు ఆడాడు.. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? -
‘నా టైమ్ ఎప్పుడొస్తుంది’
సాక్షి క్రీడా విభాగం: సరిగ్గా రెండేళ్లయింది కుల్దీప్ యాదవ్ టెస్టు మ్యాచ్ ఆడి. నాడు సిడ్నీ టెస్టులో 5 వికెట్లు పడగొట్టిన తర్వాత ఏ ముహూర్తాన హెడ్ కోచ్ రవిశాస్త్రి ‘కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలర్, అత్యుత్తమ స్పిన్నర్’ అంటూ ప్రశంసించాడో ఆ రోజు నుంచి అదృష్టం అతని గడప తొక్కలేదు. ఇటీవల ముగిసిన సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో ఒక్క వన్డే మాత్రం ఆడిన కుల్దీప్ సొంత గడ్డపైనైనా తన సుడి మారుతుందని ఆశించాడు. ‘స్వదేశంలో జరిగే మ్యాచ్‌లలో కుల్దీప్ మా ప్రణాళికల్లో భాగంగా ఉన్నాడు’ అంటూ స్వయంగా కోహ్లి గురువారమే చెప్పినా... శుక్రవారానికి వచ్చేసరికి అతనికి మరోసారి మ్యాచ్ దక్కలేదు. వైవిధ్యమైన చైనామన్ బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను కచ్చితంగా కుల్దీప్ ఇబ్బంది పెట్టగలడని అంతా భావించారు. అరుదుగా ఉండే ఎడంచేతి మణికట్టు స్పిన్నర్లు పిచ్‌తో సంబంధం లేకుండా ప్రభావం చూపించగలరు కాబట్టి తొలి టెస్టులో అతనికి చోటు ఖాయంగా కనిపించింది. అయితే టీమ్ మేనేజ్మెంట్ మాత్రం తుది జట్టులో ముగ్గురూ ‘ఫింగర్ స్పిన్నర్’లకే అవకాశమిచ్చింది. అశ్విన్‌లాంటి సీనియర్ ఉన్నప్పుడు అదే శైలి ఉన్న సుందర్‌కు చోటు కల్పించడం ఆశ్చర్యకర నిర్ణయం. జట్టు బ్యాటింగ్‌ను బలోపేతం చేసేందుకే ఇలా చేశారు అంటూ ఒక వాదన వినిపించింది. దీని ప్రకారం కోహ్లి కచ్చితంగా జట్టులో ఒక లెఫ్టార్మ్ స్పిన్నర్ ఉండాల్సిందేనని పట్టు బట్టాడు. పిచ్‌లు భిన్నమైనా... ఇటీవల శ్రీలంక బౌలర్ ఎంబుల్డెనియా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు సృష్టించడం కూడా అందుకు ఒక కారణం. రవీంద్ర జడేజా లేకపోవడంతో అతడిని పోలిన బౌలింగ్ శైలి, బ్యాటింగ్ చేయగల సామర్థ్యంతో అక్షర్ పటేల్ ఆడటం ఖాయమైపోయింది కూడా. అయితే అక్షర్ అనూహ్యంగా తప్పుకోవడంతో లెక్క మారిపోయింది. చివరి నిమిషంలో ఎంపిక చేసిన నదీమ్‌కు మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. కుల్దీప్ను కూడా ఎంపిక చేస్తే చివరి నలుగురు ఏమాత్రం బ్యాటింగ్ చేయలేనివారిగా మారిపోతారు కాబట్టి ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఉంటే బాగుంటుందని జట్టు భావించింది. ఇటీవలి బ్రిస్బేన్ టెస్టు ప్రదర్శన సుందర్‌కు అదనపు అర్హతగా మారిపోయింది. దాంతో కుల్దీప్కు అవకాశం దక్కలేదు. అయితే చివరకు అనుభవం లేని నదీమ్, సుందర్‌లనే లక్ష్యంగా చేసి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పరుగులు రాబట్టారు. ఇద్దరూ కలిసి 3.87 ఎకానమీతో పరుగులు ఇవ్వగా, 19 ఫోర్లు వీరి బౌలింగ్‌లోనే వచ్చాయి. బౌలింగ్‌లో సుందర్‌ను జట్టు పెద్దగా వాడుకోనే లేదు. 41వ ఓవర్‌కు గానీ బౌలింగ్ ప్రారంభించని అతను 12 ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రత్యేక పరిస్థితుల్లో బ్రిస్బేన్ టెస్టు అవకాశం దక్కించుకున్న సుందర్... మూడున్నరేళ్ల తర్వాత స్వదేశంలో ఆడుతున్న తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... కోహ్లి, పుజారా, రోహిత్, రహానే, పంత్‌లాంటి స్టార్ బ్యాట్స్‌మెన్ ఉన్న భారత జట్టు స్వదేశంలో భారీ స్కోరు కోసం ఏడో నంబర్ ఆటగాడి వరకు ఆధారపడుతుందా! టాప్–6 సరిగ్గా బ్యాటింగ్ చేస్తే అసలు లోయర్ ఆర్డర్ అవసరమేముంటుంది? వారు చేయలేని పనిని ఏడు, ఎనిమిదో నంబర్ ఆటగాళ్లు చేస్తారా! మూడేళ్ల తర్వాత... భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎట్టకేలకు స్వదేశంలో తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. 2018 జనవరిలో కేప్‌టౌన్‌లో అరంగేట్రం చేసిన అతను ఇప్పటి వరకు 17 టెస్టులు ఆడగా, అన్నీ విదేశాల్లోనే జరిగాయి. -
చాలా బాధ కలిగింది
♦ సిరీస్ మధ్యలో తీసేయడంపై సెహ్వాగ్ న్యూఢిల్లీ: రెండేళ్ల కిందట (2013) ఆస్ట్రేలియాతో జరి గిన టెస్టు సిరీస్ మధ్యలో తనను తీసేయడం బాధ కలిగించిందని డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నా డు. టీమ్ మేనేజ్మెంట్ నుంచిగానీ, సెలక్టర్ల నుంచిగానీ ఎలాంటి సమాచారం లేదన్నాడు. హైదరాబాద్‌లో జరిగిన రెండో టెస్టు తర్వాత వీరూను జట్టులో నుంచి తొలగించారు. అయితే చివరి రెండు టెస్టులు కూడా ఆడే అవకాశం ఇచ్చి ఆ తర్వాత రిటైర్ అవ్వమని చెబితే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ‘ఆసీస్‌తో తొలి రెండు టెస్టుల్లో నేను సరిగా పరుగులు చేయలేదు. అయితే మరో రెండు అవకాశాలు వస్తాయి కాబట్టి వాటిలో మెరు గ్గా రాణించాలని భావించా. కానీ ఆ అవకాశమే ఇవ్వకుండా నన్ను తొలగించారు. ఒకవేళ చివరి రెండు టెస్టుల్లోనూ ఆడకపోతే తీసేసినా బాగుం డేది. ఈ మొత్తం ఎపిసోడ్లో బీసీసీఐ, టీమ్ మేనేజ్మెంట్, సెలక్టర్లలో ఎవరి నుంచి సమాచారం రాలేదు. పత్రికల్లో ఈ విషయం రావడంతో చాలా బాధకు గురయ్యా’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తానని మేనేజ్మెంట్కు చెప్పినా పెద్దగా పట్టించుకోలేదన్నాడు. ఓపెనర్‌గా ఆడే సత్తా ఉందని చెప్పిన మేనేజ్మెంట్ ఓపెనింగ్ జోడిని మార్చే అవకాశం తీసుకోలేదన్నారు. పుజా రా, సచిన్, కోహ్లిలు వరుసగా మూడు, నాలుగు, ఐ దు స్థానాల్లో బ్యాటింగ్ చేస్తుండటంతో తనకు మిడిలార్డర్లో ఆడే అవకాశం రాలేదన్నాడు. -
సెలక్షన్ పరేషాన్!
విజయాల బాటలో ఉన్నప్పుడు తుది జట్టును మార్చకూడదనేది క్రికెట్లో సహజ సూత్రం. భారత కెప్టెన్ ధోని కూడా ఈ విషయంలో పట్టుదలగా ఉంటాడు. ఒక ఆటగాడు పదే పదే విఫలమైనా జట్టు గెలుస్తోంది కాబట్టి మార్పులు అనవసరం అనేది అతని నిశ్చితాభిప్రాయం. మరి టీమ్ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నప్పుడు ఏం చేయాలి. ఒకరు కాదు ఇద్దరు కాదు... జట్టు సభ్యులలో ఎక్కువ మంది పేలవ ఫామ్‌లో ఉన్నారు. చేసిన మార్పులేమో కలిసి రావడం లేదు. ఇలాంటి స్థితిలో తుది జట్టు కూర్పు కుదిరేదెలా? ఎవరిని ఎంపిక చేయాలి... ఎవరిని పక్కన పెట్టాలి..! ఓవల్ టెస్టుకు ముందు తుది జట్టు ఎంపికే ఇప్పుడు టీమిండియాకు కొత్త సమస్యగా మారింది. ‘స్థానం కోసం సొంత జట్టులోనే గట్టి పోటీ ఉంది. ఇది మంచి పరిణామం’... భారత్ జోరు మీదున్నప్పుడు జట్టు గురించి ఈ మాట తరచుగా వినిపించేది. మన ‘బెంచ్ బలం’ బాగుందని, అందరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు కాబట్టి తుది జట్టు ఎంపిక కష్టంగా మారిం దని అనేవారు. అయితే ఇప్పుడు ఈ ‘పోటీ’ అవాంఛనీయ మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఒకరు విఫలమైతే ఆ స్థానంలో రావాల్సిన ఆటగాడిపై కూడా జట్టు మేనేజ్మెంట్కు నమ్మకం లేని పరిస్థితి ఉంది. ఈ సమయంలో చివరి టెస్టు తుది జట్టు ఎంపికలో జరిగే పొరపాట్లు సుదీర్ఘ కాలం కెప్టెన్‌ను వెంటాడవచ్చు. సరిగ్గా చెప్పాలంటే ఓవల్ టెస్టులో విఫలమైతే ప్రస్తుత జట్టులో చాలా మం దికి భవిష్యత్తులో మరో టెస్టు ఆడే అవకాశం కూడా దక్కకపోవచ్చు. ఫలితం ఇవ్వని మార్పులు లార్డ్స్ టెస్టులో ఘన విజయం తర్వాత సౌతాంప్టన్‌లో ధోని రెండు మార్పులతో బరిలోకి దిగాడు. ఇషాంత్ గాయంతో తప్పుకోగా బిన్నీని పక్కన పెట్టారు. వీరి స్థానాల్లో పంకజ్ సింగ్, రోహిత్ శర్మ జట్టులోకి వచ్చాడు. పంకజ్ ఒక్క వికెట్ తీయకపోగా...రోహిత్ 28, 6 పరుగులు చేశాడు. ఆ తర్వాత మాంచెస్టర్‌లో భారత్ మూడు మార్పులు చేసింది. ధావన్, రోహిత్, షమీ స్థానాల్లో గంభీర్, అశ్విన్, ఆరోన్ వచ్చారు. వీరిలో ఆరోన్ ఆకట్టుకున్నాడు. అశ్విన్ బ్యాటింగ్‌లో నిలబడినా...తన అసలు బాధ్యత బౌలింగ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఇక చాలా కాలం తర్వాత టెస్టు ఆడిన గంభీర్ అయితే ఘోరంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో చివరి టెస్టు కోసం తుది జట్టును ఎంపిక చేసే ముందు ధోని మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఎవరి స్థానంలో ఎవరు? జడేజా, అశ్విన్‌లలో ఎవరిని తీసుకోవాలనేదే ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ ముందున్న ప్రధాన సమస్య. ఓవల్‌లో పేస్‌కు అనుకూలమైన వికెట్ ఉండవచ్చని వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఇద్దరిలో ఒకరికే అవకాశం దక్కడం ఖాయం. బౌలింగ్‌లో ఇద్దరూ అంతంత మాత్రంగానే రాణించారు. గత టెస్టులోనైతే అశ్విన్‌కు ఒక్క వికెట్టూ దక్కలేదు. ఇక లార్డ్స్‌లో జడేజా కీలక ఇన్నింగ్స్ భారత్ విజయానికి బాటలు వేసినా ఆ తర్వాత రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. నాలుగో టెస్టులో అశ్విన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కాబట్టి ఎవరి స్థానమూ ఖాయం కాదు. ఐదుగురు బౌలర్లతో ఆడాలనుకుంటేనే ఈ ఇద్దరూ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఈ ఇద్దరిదే సమస్య! రెండు చెత్త ప్రదర్శనల్లో మెరుగైంది ఎంచుకోమంటే ఏది ఎంచుకుంటాం! ఇప్పుడు జట్టు ఓపెనర్ స్థానం కూడా సరిగ్గా అలాగే ఉంది. ధావన్ వరుసగా విఫలమైన చోట గంభీర్‌కు అవకాశం ఇస్తే అతనూ అలాగే ఆడాడు. కాబట్టి వీరిలో ఎవరికి చాన్స్ అనేది తేల్చుకోవాల్సి ఉంది. విఫలమవుతున్నా... యువ ఆటగాడు కాబట్టి ధావన్ వైపే కొంత మొగ్గు ఉంది. ఇదే జరిగితే గంభీర్ కెరీర్ ముగిసినట్లే! అయితే వన్డే ఓపెనర్‌గా రోహిత్‌తో మరో ప్రయోగం చేయడమా...ఒకప్పుడు ఓపెనింగ్ చేసిన రహానేను ముందు పంపడమా...ఇలా వేర్వేరు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మొత్తానికి మ్యాచ్‌లో వ్యూహ ప్రతివ్యూహాలకు ముందే జట్టును ఎంపిక చేసేందుకు ధోని తీవ్ర కసరత్తు చేయాలి. - సాక్షి క్రీడా విభాగం ఓవల్‌లో ఒక విజయం... ఐదో టెస్టు జరిగే లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో భారత రికార్డు చెత్తగా ఏమీ లేదు. ఇక్కడ 11 టెస్టులు ఆడిన ఇండియా ఒక మ్యాచ్‌లో గెలిచి 3 ఓడింది. మరో 7 మ్యాచ్‌లు ‘డ్రా’ చేసుకోగలిగింది. 1971 సిరీస్‌లో భాగంగా అజిత్ వాడేకర్ నాయకత్వంలోని టీమిండియా 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి మూడు టెస్టుల సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకుంది. 2011 పర్యటనలో ధోని సేన ఇదే గ్రౌండ్లో ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో చిత్తయింది. ఇషాంత్ ఫిట్‌గా ఉన్నాడా? లార్డ్స్ టెస్టు హీరో ఇషాంత్ శర్మ గత రెండు మ్యాచుల్లోనూ ఆడకపోవడం భారత్‌ను దెబ్బ తీసింది. అతను ఈ మ్యాచ్ బరిలోకి దిగడంపై ఇంకా స్పష్టత రాలేదు. బుధవారం అతను ప్రాక్టీస్‌లో మాత్రం చురుగ్గా కనిపించాడు. ఇషాంత్ జట్టులోకి వస్తే మరో సందేహం లేకుండా నేరుగా పంకజ్‌పై వేటు పడుతుంది. ఒక వేళ ఇషాంత్ లేడంటే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. ఎందుకంటే పంకజ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ మళ్లీ షమీనే నమ్ముకోవచ్చు. ఈ టూర్లో ఇప్పటి వరకు మ్యాచ్ ఆడని ఆటగాడు ఈశ్వర్ పాండే మాత్రమే. పోయేదేముంది... ఒక ప్రయత్నం చేసి చూద్దామనుకుంటే తన చెన్నై సూపర్ కింగ్స్ సహచరుడిని ధోని ఎంపిక చేసే అవకాశం ఉంది.