చాలా బాధ కలిగింది | Sehwag 'hurt' by his ouster from India team | Sakshi
Sakshi News home page

చాలా బాధ కలిగింది

Published Thu, Dec 31 2015 2:45 AM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM

చాలా బాధ కలిగింది

చాలా బాధ కలిగింది

సిరీస్ మధ్యలో తీసేయడంపై సెహ్వాగ్
 న్యూఢిల్లీ:
రెండేళ్ల కిందట (2013) ఆస్ట్రేలియాతో జరి గిన టెస్టు సిరీస్ మధ్యలో తనను తీసేయడం బాధ కలిగించిందని డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నా డు. టీమ్ మేనేజ్‌మెంట్ నుంచిగానీ, సెలక్టర్ల నుంచిగానీ ఎలాంటి సమాచారం లేదన్నాడు. హైదరాబాద్‌లో జరిగిన రెండో టెస్టు తర్వాత వీరూను జట్టులో నుంచి తొలగించారు. అయితే చివరి రెండు టెస్టులు కూడా ఆడే అవకాశం ఇచ్చి ఆ తర్వాత రిటైర్ అవ్వమని చెబితే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.
 
  ‘ఆసీస్‌తో తొలి రెండు టెస్టుల్లో నేను సరిగా పరుగులు చేయలేదు. అయితే మరో రెండు అవకాశాలు వస్తాయి కాబట్టి వాటిలో మెరు గ్గా రాణించాలని భావించా. కానీ ఆ అవకాశమే ఇవ్వకుండా నన్ను తొలగించారు. ఒకవేళ చివరి రెండు టెస్టుల్లోనూ ఆడకపోతే తీసేసినా బాగుం డేది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్లలో ఎవరి నుంచి సమాచారం రాలేదు. పత్రికల్లో ఈ విషయం రావడంతో చాలా బాధకు గురయ్యా’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
 
  మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తానని మేనేజ్‌మెంట్‌కు చెప్పినా పెద్దగా పట్టించుకోలేదన్నాడు. ఓపెనర్‌గా ఆడే సత్తా ఉందని చెప్పిన మేనేజ్‌మెంట్ ఓపెనింగ్ జోడిని మార్చే అవకాశం తీసుకోలేదన్నారు. పుజా రా, సచిన్, కోహ్లిలు వరుసగా మూడు, నాలుగు, ఐ దు స్థానాల్లో బ్యాటింగ్ చేస్తుండటంతో తనకు మిడిలార్డర్‌లో ఆడే అవకాశం రాలేదన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement