IND Vs IRE: Loudest Cheer From Crowd As Sanju In Playing XI Video Goes Viral - Sakshi
Sakshi News home page

IND Vs IRE Playing XI: పాండ్యా నోటి వెంట సంజూ పేరు.. ప్రేక్షకుల కేరింతలు.. వీడియో వైరల్‌

Published Wed, Jun 29 2022 10:58 AM | Last Updated on Wed, Jun 29 2022 12:17 PM

IND Vs IRE: Loudest Cheer From Crowd As Sanju in Playing XI Video Viral - Sakshi

సంజూ శాంసన్‌- హార్దిక్‌ పాండ్యా(PC: BCCI)

India vs Ireland 2nd T20- Sanju Samson: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐర్లాండ్‌ పర్యటనలో భాగంగా భారత జట్టులో తిరిగి చోటు దక్కించుకున్నాడు సంజూ శాంసన్‌. టీ20 సిరీస్‌ ఆడేందుకై హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో ఐర్లాండ్‌కు టూర్‌కు వచ్చిన జట్టులో భాగమయ్యాడు. ఈ క్రమంలో మొదటి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమైనా.. రెండో టీ20లో సంజూ తుది జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. 

ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయం కారణంగా దూరం కావడంతో అతడి స్థానంలో ఎంట్రీ ఇచ్చిన సంజూ.. అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇషాన్‌ కిషన్‌తో కలిసి ఓపెనింగ్‌కు దిగి 42 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియా విజయంలో కీలకంగా వ్యవహరించిన ఈ కేరళ బ్యాటర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.

సంజూ.. సంజూ
కాగా సంజూ రీ ఎంట్రీతో అభిమానులు ఎంత ఖుషీ అయ్యారో చెప్పేందుకు తార్కాణంగా నిలిచిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఐర్లాండ్‌తో రెండో టీ20 ఆరంభానికి ముందు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ.. మూడు మార్పులతో బరిలోకి దిగినట్లు తెలిపాడు. గాయపడిన రుతు స్థానంలో సంజూ ఎంట్రీ ఇస్తున్నాడు అనగానే మైదానంలో ప్రేక్షకులు గట్టిగా అరుస్తూ తమ సంతోషాన్ని తెలియజేశారు.

అవును నిజమే
ఇందుకు స్పందించిన పాండ్యా సైతం సంజూ పేరు వినగానే అందరూ ఖుషీ అయి ఉంటారంటూ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఆవేశ్‌ ఖాన్‌కు బదులు హర్షల్‌ పటేల్‌, యజువేంద్ర చహల్‌కు బదులు రవి బిష్ణోయి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో పాండ్యా సేన 4 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది.

కాగా సంజూ పునరామనానికి సంబంధించి హార్దిక్‌ మాట్లాడుతున్న వీడియోను షేర్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ తమ కెప్టెన్‌ పేరు వినగానే గూస్‌బంప్స్‌ వచ్చాయంటూ కామెంట్‌ చేసింది. ఇక ఐపీఎల్‌-2022 ఫైనల్లో హార్దిక్‌ పాండ్యా జట్టు గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓటమి పాలై రాజస్తాన్‌ రన్నరప్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.
చదవండి: Hardik Pandya- Umran Malik: అద్భుతమైన షాట్లు.. అందుకే ఆఖర్లో ఉమ్రాన్‌ చేతికి బంతి.. ఈ క్రెడిట్‌ మొత్తం వాళ్లదే!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement