టీమిండియా ప్రధాన కోచ్‌గా తాను కొనసాగబోవడం లేదని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ కోచ్‌గా తన కెరీర్‌లో చివరిదని పేర్కొన్నాడు. ఏదేమైనా భారత జట్టు మార్గదర్శకుడిగా వ్యవహరించడం తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని ఈ మాజీ కెప్టెన్ హర్షం వ్యక్తం చేశాడు.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత ద్రవిడ్ పదవీ కాలం ముగిసినప్పటికీ ఈ మెగా ఈవెంట్ కోసం కొనసాగమని బీసీసీఐ అతడిని కోరిన విషయం తెలిసిందే. ఇందుకు అంగీకరించిన ద్రవిడ్ ప్రస్తుతం టీమిండియాతో కలిసి అమెరికాకు వెళ్లాడు.
అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్య ఇస్తున్న వరల్డ్‌కప్-2024 జూన్ 1న మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనున్న తరుణంలో రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు.
ఈ సందర్భంగా.. ‘‘ప్రతి టోర్నమెంట్ నాకు ముఖ్యమైనదే. టీమిండియా కోచ్‌గా ప్రతి మ్యాచ్‌లోనూ పూర్తి ఎఫర్ట్ పెట్టాను. టీ20 వరల్డ్‌కప్ కూడా అంతే. అయితే, నేను ఇన్‌చార్జ్‌గా ఉన్న సమయంలో ఇదే ఆఖరిది కాబట్టి మరింత ప్రాముఖ్యం ఏర్పడింది.
నా పనిని పూర్తి నిష్ఠగా.. ప్రేమతో చేశాను. టీమిండియాకు కోచింగ్ ఇవ్వడం అనేది నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైనది. గొప్ప ఆటగాళ్లున్ను జట్టుతో పని చేయడాన్ని పూర్తిగా ఆస్వాదించాను.
అయితే, బిజీ షెడ్యూల్స్, పని ఒత్తిడి కారణంగా తిరిగి ఈ జాబ్‌కు తిరిగి అప్లై చేయాలనుకోవడం లేదు’’ అంటూ తాను హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పుకొనేందుకు సిద్ధమైనట్లు రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు.
కాగా ద్రవిడ్ స్థానంలో గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా వస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గౌతీ సైతం తాను ఈ గౌరవప్రదమైన బాధ్యతను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment