
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా డల్లాస్ వేదికగా అమెరికా-పాకిస్తాన్ మధ్య జరిగన మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. సూపర్ ఓవరకు దారితీసిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఆతిథ్య అమెరికా చిత్తు చేసింది.
యావత్తు క్రికెట్ ప్రపంచం తమ వైపు చూసేలా యూఎస్‌ఎ అద్బుతమైన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 159/7 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో యూఎస్‌ఏ కూడా 159/3 స్కోరుతో నిలిచింది.
దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. సూపర్ ఓవర్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేయగా.. పాక్ 13 పరుగులు మాత్రమే చేసింది. ఇక అమెరికా-పాక్ మధ్య జరిగిన ఈ థ్రిల్లింగ్ పోరుకు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఆకర్షితుడయ్యాడు.
న్యూయర్క్‌లో సబ్‌వేలో ద్రవిడ్ ప్రయాణిస్తూ ఇరు జట్ల మధ్య జరిగిన సూపర్ ఓవర్ బాల్ టూ బాల్‌ను తన ఫోన్‌లో ఫాలోయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Rahul Dravid following the Super Over of Pakistan vs USA on Espn Cricinfo. [📸: Vishal Misra] pic.twitter.com/eanrXe6my6
— Johns. (@CricCrazyJohns) June 6, 2024