
సిరీస్‌లో నిలిచేందుకు నేడు ఇంగ్లండ్‌తో జరిగే రెండో టి20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. డెర్బీషైర్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం గెలిస్తే సిరీస్‌ను సమం చేస్తుంది. ఓడితే సిరీస్ ను కోల్పోతుంది. తొలి మ్యాచ్‌లో దీప్తి శర్మ మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment