న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాటర్ ఫిన్ అలెన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డాడు. స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసిన అలెన్.. తాజాగా జరుగుతున్న రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 41 బంతులను ఎదుర్కొన్న అలెన్ 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు.
హాఫ్ సెంచరీ మార్కును కేవలం 24 బంతుల్లోనే అందుకున్న అలెన్ ఆతర్వాత కాస్త నెమ్మదించాడు. మరో భారీ షాట్‌కు ప్రయత్నించే క్రమంలో ఉసామా మిర్ అలెన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మొత్తంగా పాక్ బౌలర్లను ఊచకోత కోసిన అలెన్.. క్రీజ్‌లో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. అలెన్ ధాటికి న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3 వికెట్లు పడగొట్టగా.. అబ్బాస్ అఫ్రిది 2, ఆమిర్ జమాల్, ఉసామా మిర్, షాహీన్ అఫ్రిది తలో వికెట్ దక్కించుకున్నారు.
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (15 బంతుల్లో 20; 3 ఫోర్లు), ఫిన్ అలెన్ కివీస్‌కు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 5.1 ఓవర్లలో 59 పరుగులు జోడించారు. కాన్వే ఔటయ్యాక బరిలోకి దిగిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్రీజ్‌లో ఉన్నంతసేపు అసౌకర్యంగా కనిపించాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ సాయంతో 26 పరుగులు చేసిన అతను ఇన్నింగ్స్ 10 ఓవర్ తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
తొలి మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన డారిల్ మిచెల్ 17 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. తొలి మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన మార్క్ చాప్‌మన్ 4 పరుగులకే ఔటయ్యాడు. ఆడమ్ మిల్నే, ఐష్ సోధి డకౌట్లు కాగా.. గ్లెన్ ఫిలిప్ 13, సాంట్నర్ 25 పరుగులు చేశారు. భారీ స్కోర్ దిశగా పయనిస్తున్న కివీస్‌ను హరీస్ రౌఫ్ 19వ ఓవర్‌లో దెబ్బకొట్టాడు. ఈ ఓవర్ 1, 2, 4 బంతులకు వికెట్లు పడగొట్టిన రౌఫ్.. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి కివీస్ భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. కాగా, ఈ సిరీస్‌లో కివీస్ తొలి మ్యాచ్‌లో పాక్‌ను 46 పరుగుల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment