కొలంబో: టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా సోకడంతో మంగళవారం జరగాల్సిన రెండో టీ20 నేటికి వాయిదా పడటంతో పాటు జట్టు సమీకరణలంతా ఒక్కసారిగా మారిపోయాయి. నిన్న మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు కృనాల్ గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పడంతో అతడికి కరోనా పరీక్ష నిర్వహించారు. ఇందులో అతనికి పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత భారత బృందం మొత్తానికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా అందరికీ నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే కృనాల్ సహా అతనికి అతిసమీపంగా మెలిగిన ఎనిమిది మంది(పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, కృష్ణప్ప గౌతమ్, యుజ్వేంద్ర చహల్, శిఖర్ ధవన్, మనీష్ పాండే) ఆటగాళ్లను ఐసోలేషన్‌కు వెళ్లాల్సిందిగా బీసీసీఐ ఆదేశించింది. దీంతో మిగతా టీ20ల నుంచి వారంతా తప్పుకున్నాడు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం జట్టులో కేవలం నలుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్లు(దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సంజు సామ్సన్, నితీష్ రాణా) మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై చర్చించిన బీసీసీఐ.. సిరీస్ యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించింది. దీంతో తదుపరి రెండు మ్యాచ్‌లకు జట్టు కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత భారత జట్టు: దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సంజు సామ్సన్ (కీపర్), నితీష్ రాణా, దీపక్ చహార్, భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), కుల్దీప్ యాదవ్, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తి, నవదీప్ సైనీ, చేతన్ సకారియా.
Comments
Please login to add a commentAdd a comment