
టీమిండియా ఆటగాళ్లు(ఫొటో కర్టెసీ: బీసీసీఐ)
కొలంబో: శ్రీలంక టూర్‌లో కరోనా కలకలం రేగింది. భారత్ - శ్రీలంక మధ్య మంగళవారం జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ రేపటికి వాయిదా పడింది. కాగా టీమిండియా ప్లేయర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరు జట్లు ఐసోలేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక టీమిండియా, శ్రీలంక ఆటగాళ్లకు అందరికీ కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించిన అనంతరం నెగటివ్‌గా తేలితేనే బుధవారం మ్యాచ్ సజావుగా సాగే అవకాశం ఉంది.
మరోవైపు.. విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్ వంటి యువ ప్లేయర్లు గాయాల బారిన పడటంతో.. శ్రీలంక పర్యటనలో ఉన్న సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షాకు టెస్టు సిరీస్‌లో ఆడేందుకు బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే, ప్రస్తుతం వీరితో పాటు లంక టూర్‌లో ఉన్న కృనాల్‌కు కరోనా సోకడంతో ఇంగ్లండ్‌కు వెళ్లే అంశంపై సందిగ్దత నెలకొంది. ఇక మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత జట్టు 38 పరుగుల తేడాతో విజయం సాధించి ముందంజలో నిలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment