టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న రాహుల్ త్రిపాఠికి మరోసారి నిరాశే ఎదురైంది. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు త్రిపాఠికి ఎంపికైనప్పటికీ.. తొలి టీ20 తుది జట్టులో చోటు దక్కలేదు. కాగా ఐర్లాండ్ సిరీస్ నుంచి భారత జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కడం లేదు.
సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో కనీసం లంకతో సిరీస్‌లోనైనా చోటు దక్కుతుంది అని అభిమానులు భావించారు. అయితే మరోసారి త్రిపాఠి బెంచ్‌కే పరిమితం కావడంతో జట్టు మేనేజెమెంట్‌పై అభిమానులు తీవ్ర విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. జట్టులో చోటు ఇవ్వనప్పుడు ఎందుకు ఎంపిక చేస్తున్నారని ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
"డ్రింక్స్ అందించడానికా త్రిపాఠిని సెలక్ట్ చేశారు" అంటూ ఓ అభిమాని ట్విట్ చేశారు. మరి కొంత మంది అయితే కావాలనే జట్టు మేనేజ్‌మెంట్ ఇలా చేస్తుందిని పోస్టులు పెడుతున్నారు. కాగా ఐపీఎల్‌తో పాటు దేశీవాళీ క్రికెట్‌లో కూడా ఈ ముంబైకర్‌కు మంచి రికార్డు ఉంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టులో కీలక ఆటగాడిగా త్రిపాఠి ఉన్నాడు. ప్రతీ సీజన్‌లోనూ రాహుల్ మెరుగ్గా రాణిస్తున్నాడు.
చదవండి: IND vs SL 1st T20: శ్రీలంకతో తొలి టీ20.. గిల్, మావి అరంగేట్రం
Comments
Please login to add a commentAdd a comment