విరాట్ కోహ్లి- దినేశ్ కార్తిక్
Virat Kohli's First-Choice Replacement By DK: ‘‘నేను కేవలం ఆ ఒక్క వ్యక్తి భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించడం లేదు. క్రికెట్‌ను ప్రేమించే, ఆటలో ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలించే అభిమానుల కోణం నుంచి ఈ మాట చెబుతున్నా.. సమీప భవిష్యత్తులో విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేయగలిగే ఆటగాడు రాహుల్ త్రిపాఠి’’ అని టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ అన్నాడు.
అరంగేట్రంలోనే నిరాశ
ఇటీవల శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌తో రాహుల్ త్రిపాఠి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కోహ్లి గైర్హాజరీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. లంకతో రెండో మ్యాచ్‌లోనూ అదే స్కోరు.
రాహుల్ త్రిపాఠి
అయితే, ఆఖరి టీ20లో మాత్రం 31 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ప్రభావం చూపగలిగాడు. 16 బంతుల్లో 35 పరుగులతో త్రిపాఠి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక న్యూజిలాండ్‌తో పొట్టి సిరీస్‌లోనూ ఇదే జోష్ కొనసాగిస్తాడని ఆశగా ఎదురుచూస్తే తొలి మ్యాచ్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు.
కీలక సమయంలో మాత్రం అదుర్స్
ఆ తర్వాతి మ్యాచ్‌లో 13 పరుగులు చేసిన త్రిపాఠి.. సిరీస్ ఫలితాన్ని తేల్చే అహ్మదాబాద్ టీ20లో మాత్రం అదరగొట్టాడు. 22 బంతుల్లో 44 పరుగులతో ఉత్తమంగా రాణించాడు. తద్వారా టీమిండియా భారీ స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఆరంభంలో ‘‘కోహ్లి స్థానాన్ని కట్టబెడితే ఇలాగేనా చేసేది’’ అంటూ విమర్శించిన వాళ్లే.. ‘‘పర్లేదు.. పనికొస్తాడు’’ అంటూ ప్రశంసిచేలా చేసుకున్నాడు.
వేరే వాళ్లు వద్దు.. అతడే అర్హుడు
ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్ షోలో పాల్గొన్న దినేశ్ కార్తిక్ రాహుల్ త్రిపాఠిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఐపీఎల్‌లో అతడితో కేకేఆర్‌కు ఆడిన అనుభవం నాకుంది. తనని దగ్గరగా పరిశీలించాను. జట్టు ప్రయోజనాల కోసం నిస్వార్థంగా ఆడే గుణం ఉంది. రానున్న ఐపీఎల్‌లో అతడు అదరగొట్టొచ్చు. అలా జరగకనూపోవచ్చు. అయినప్పటికీ టీమిండియాలో మూడో స్థానానికి అతడు పూర్తి అర్హుడని నేను భావిస్తున్నా.
ఒకవేళ విరాట్ కోహ్లి ఆడాలనుకుంటే ఓకే.. లేదు తను తప్పుకోవాలని అనుకుంటే మాత్రం అతడి స్థానంలో రాహుల్ త్రిపాఠికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. వేరే స్థానాల్లో ఆడుతున్న వాళ్లను ప్రమోట్ చేయడం వంటివి చేయకుండా త్రిపాఠికి అవకాశం ఇవ్వాలి. అతడు 40 లేదంటే 30 పరుగులకే చేశాడనే గణాంకాలతో పనిలేదు. కీలక సమయంలో అతడు రాణించగలడు. దయచేసి ఈ విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దు’’ అని డీకే సూచించాడు.
రోహిత్ వారసుడు గిల్.. మరి?
కాగా ఫార్మాట్లకు అతీతంగా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అద్భుతంగా రాణిస్తున్న నేపథ్యంలో రోహిత్ శర్మ వారసుడు దొరికేశాడని, మరి కోహ్లి స్థానాన్ని భర్తీ చేసేదెవరంటూ క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ త్రిపాఠిని ఉద్దేశించి డీకే చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. దినేశ్ కార్తిక్ వ్యాఖ్యలపై త్రిపాఠి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: MICT Vs DSG: నిరాశపరిచిన బేబీ ఏబీడీ.. రెచ్చిపోయిన డికాక్.. ఎంఐపై సూపర్ జెయింట్స్ గెలుపు
ILT 20 2023: ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు.. పఠాన్‌ను ఉతికారేసిన విండీస్ స్టార్
This is best and most beautiful tribute to @tripathirahul52 anyone can give . One of the most selfless player in the circuit who always keep him team above him every single time . Bro u r a joy to watch ♥️♥️ and @DineshKarthik thank you for saying this . pic.twitter.com/o8wBiM6EZc
— Raazi (@Rg86037221) February 1, 2023
Comments
Please login to add a commentAdd a comment