పుణే వేదికగా శ్రీలంకతో రెండో టీ20లో టీమిండియా తలపడేందుకు సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అదే విధంగా రాహుల్ త్రిపాఠి ఈ మ్యాచ్‌తో భారత్ తరపున అరంగేట్రం చేయనున్నాడు.
మరోవైపు తొలి టీ20కు దూరమైన భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ రెండో టీ20కు జట్టులోకి వచ్చాడు. అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి రావడంతో హర్షల్ పటేల్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక శ్రీలంక మాత్రం తొలి టీ20 జట్టుతోనే బరిలోకి దిగింది.
తుది జట్లు:
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక
భారత్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
చదవండి: Abhimanyu Easwaran: తండ్రి కట్టిన స్టేడియంలోనే తనయుడు సెంచరీ! శభాష్ అభిమన్యు
Comments
Please login to add a commentAdd a comment