సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా యంగ్ డైనమైట్ రింకూ సింగ్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న రింకూ 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
మార్క్రమ్ వేసిన ఇన్నింగ్స్ 19 ఓవర్లో ఒక్కసారిగా పేట్రేగిపోయిన రింకూ.. ఆ ఓవర్ చివరి రెండు బంతులను భారీ సిక్సర్లుగా మలిచి భారత ఇన్నింగ్స్‌కు ఊపుతెచ్చాడు. మార్క్రమ్ బౌలింగ్‌లో రెండో సిక్సర్ ఏకంగా మీడియా బాక్స్ అద్దాలను ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
Rinku Singh's six broke media box glass. 🔥
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2023
- Rinku is insane...!!!!pic.twitter.com/hJazne80PU
అనంతరం భారత ఇన్నింగ్స్ మరో 3 బంతుల్లో ముగుస్తుందనగా వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. 19.3 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 180/7గా ఉంది. గెరాల్డ్ కొయెట్జీ బౌలింగ్‌లో చివరి ఓవర్ రెండు, మూడు బంతుల్లో రవీంద్ర జడేజా (19), అర్షదీప్ సింగ్(0) ఔటయ్యారు. రింకూ సింగ్ (68)తో పాటు సిరాజ్ క్రీజ్‌లో ఉన్నాడు.
Rinku Singh's six broke the glass of the media box. (Rajal Arora). pic.twitter.com/juEYkJV5Lk
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2023
భారత ఇన్నింగ్స్‌లో రింకూతో పాటు సూర్యకుమార్ యాదవ్ (56) విధ్వంసం సృష్టించగా.. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, అర్షదీప్ సింగ్ డకౌట్లు అయ్యారు. తిలక్ వర్మ (29), రవీంద్ర జడేజా (19) క్రీజ్‌లో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్.. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది.
Comments
Please login to add a commentAdd a comment