రాణించిన హేమలత, రాధా యాదవ్
సిల్హెట్: బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం జరిగిన రెండో టి20కి వర్షం అంతరాయం కలిగించగా.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 19 పరుగులతో బంగ్లాదేశ్‌పై గెలిచింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 119 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ ముర్షిదా ఖాటున్ (49 బంతుల్లో 46; 5 ఫోర్లు) రాణించగా, రీతూ మోని (18 బంతుల్లో 20; 2 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. రాధా యాదవ్ 3, శ్రేయాంక, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు వర్షంతో ఆట నిలిచే సమయానికి 5.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్ షఫాలీ వర్మ (0) డకౌట్ కాగా, స్మృతి మంధాన (5 నాటౌట్) నింపాదిగా ఆడింది.
కానీ హేమలత దయాళన్ (24 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగింది. మైదానం చిత్తడిగా మారడంతో మళ్లీ మ్యాచ్ కొనసాగించే అవకాశం లేకపోయింది. హేమలతకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment