నేడు బంగ్లాదేశ్‌తో రెండో టి20
జోరు మీదున్న టీమిండియా
రాత్రి 7 గంటల నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలలో ప్రత్యక్ష ప్రసారం
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌పై తొలి టి20లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ మరో విజయంపై గురి పెట్టింది. గత మ్యాచ్ జోరును కొనసాగించి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే రెండో టి20లో భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. తొలి మ్యాచ్ ప్రదర్శనను బట్టి చూస్తే మరో మాట లేకుండా భారతే ఫేవరెట్‌గా కనిపిస్తుండగా... బంగ్లా ఈసారైనా పోటీనిస్తుందా అనేది చూడాలి.
దూకుడుకు మారుపేరుగా...
తొలి టి20లో భారత జట్టు ఆటతీరు చూస్తే మరో గెలుపు కూడా కష్టం కాకపోవచ్చు. అర్‡్షదీప్, వరుణ్ చక్రవర్తి తమ బౌలింగ్‌తో బంగ్లాదేశ్ పని పట్టగా... ఇతర బౌలర్లు మయాంక్, సుందర్ కూడా ఒక చేయి వేశారు. వైవిధ్యమైన ఈ బౌలింగ్ దళానికి ప్రత్యర్థిని కట్టిపడేయగల సామర్థ్యం ఉంది. ఇక బ్యాటింగ్‌లోనైతే అందరూ చెలరేగిపోయారు. నాటౌట్‌గా నిలిచిన నితీశ్ కుమార్ రెడ్డి మినహా మిగతా నలుగురు బ్యాటర్లు 150కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించారు.
ఈ ఫార్మాట్‌లో సూర్యకుమార్ ఎంత ప్రమాదకరమైన బ్యాటరో అందరికీ తెలిసిందే. రనౌట్ కాకపోయింటే అభిõÙక్ శర్మ కూడా విధ్వంసం సృష్టించేవాడే. ఇలాంటి స్థితిలో భారత్ మరోసారి పైచేయి సాధించేందుకు అన్ని విధాలా అవకాశం ఉంది. యువ పేసర్ హర్షిత్ రాణా రిజర్వ్‌లో ఉన్నా... వెంటనే మయాంక్‌ను తప్పించి అతడిని ఆడించే అవకాశాలు తక్కువ. అయితే నితీశ్ స్థానంలో తిలక్ వర్మకు చాన్స్ ఉంది.
గెలిపించేదెవరు?
టి20ల్లో బంగ్లాదేశ్ ఆట ఎప్పుడో దశాబ్దం క్రితం స్థాయిలోనే ఆగిపోయింది. ఇది గత మ్యాచ్‌లో మరోసారి కనిపించింది. బ్యాటర్ల నుంచి ఎలాంటి ధాటి కనిపించకపోగా... అనుభవం ఉన్న ప్రధాన ప్లేయర్లు సైతం తేలిపోతున్నారు. కెప్టెన్ నజు్మల్, మిరాజ్ కేవలం వంద పరుగుల స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించడం ఆ జట్టు పరిస్థితిని చూపించింది.
ఇక జట్టు తరఫున అందరికంటే ఎక్కువగా 139 టి20లు ఆడిన అనుభవం ఉన్న మహ్ముదుల్లా కూడా ఇటీవల ఎలాంటి ప్రభావం చూపించలేకపోతున్నాడు. ఈ సిరీస్ తర్వాత రిటైర్ కానున్న అతను ఈ మ్యాచ్‌లోనైనా ప్రభావం చూపిస్తే బంగ్లా పరువు దక్కుతుంది.
పిచ్, వాతావరణం
ఫిరోజ్‌షా కోట్లా మైదానం బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్. ఐపీఎల్‌లో భారీ స్కోర్లు వచ్చాయి. ఈసారీ అదే జరగవచ్చు. అనుకూల వాతావరణం ఉంది. మ్యాచ్ రోజున వర్ష సూచన లేదు.
2 ఫిరోజ్‌షా కోట్లా (అరుణ్ జైట్లీ స్టేడియం) మైదానంలో ఇప్పటి వరకు భారత జట్టు 3 టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 1 మ్యాచ్‌లో గెలిచి, 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 2017లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 పరుగులతో నెగ్గిన భారత్... 2019లో బంగ్లాదేశ్ చేతిలో 7వికెట్ల తేడాతో... 2022లో దక్షిణాఫ్రికా చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment