‘శత’క్కొట్టిన భారత ఓపెనర్
47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100
రెండో టి20లో జింబాబ్వేపై 100 పరుగులతో టీమిండియా ఘనవిజయం
హరారే: అంతర్జాతీయ వేదికపై తన ఆగమనాన్ని అదరగొట్టే ఇన్నింగ్స్‌తో అభిషేక్ శర్మ చాటుకున్నాడు. జింబాబ్వేతో ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ సెంచరీ సాధించాడు. శనివారం జరిగిన తొలి టి20లో ‘సున్నా’కే అవుటైన ఈ పంజాబ్ బ్యాటర్ రెండో టి20లో మాత్రం ‘శత’క్కొట్టాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో చెలరేగిపోయిన అభిõÙక్ సరిగ్గా 100 పరుగులు చేసి అవుటయ్యాడు.
రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77; 11 ఫోర్లు, 1 సిక్స్), రింకూ సింగ్ (22 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా మెరిపించడంతో భారత జట్టు 100 పరుగుల తేడాతో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. టి20ల్లో జింబాబ్వేపై ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే.
అనంతరం 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. మధెవెరె (39 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్), జోంగ్వి (26 బంతుల్లో 33; 4 ఫోర్లు) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ (3/37), అవేశ్ ఖాన్ (3/15), రవి బిష్ణోయ్ (2/11) రాణించారు. అభిõÙక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (2) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. గిల్ అవుటయ్యాక అభిõÙక్, రుతురాజ్ భారత ఇన్నింగ్స్‌ను నడిపించారు. వ్యక్తిగత స్కోరు 27 పరుగులవద్ద అభిõÙక్ ఇచ్చిన క్యాచ్‌ను మసకద్జా వదిలేశాడు. ఆ తర్వాత అభిõÙక్ చెలరేగిపోయాడు. మైర్స్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో అభిషేక్ 2,4,6,4,6,4తో 28 పరుగులు సాధించాడు. దాంతో భారత స్కోరు 100 పరుగులు దాటింది.
మసకద్జా వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో అభిõÙక్ వరుసగా 3 సిక్స్‌లు కొట్టి 46 బంతుల్లోనే తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే మైర్స్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ పెవిలియన్ చేరుకన్నాడు. రుతురాజ్‌తో కలిసి అభిõÙక్ రెండో వికెట్‌కు 137 పరుగులు జోడించాడు.
అభిషేక్ నిష్క్రమించాక వచ్చిన రింకూ సింగ్ కూడా దూకుడుగా ఆడటంతో భారత స్కోరు 200 పరుగులు దాటింది. భారత్ చివరి 10 ఓవర్లలో 160 పరుగులు చేయడం విశేషం. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్ బుధవారం జరుగుతుంది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: శుబ్‌మన్ గిల్ (సి) బెనెట్ (బి) ముజరబాని 2; అభిషేక్ శర్మ (సి) మైర్స్ (బి) మసకద్జా 100; రుతురాజ్ గైక్వాడ్ (నాటౌట్) 77; రింకూ సింగ్ (నాటౌట్) 48; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 234. వికెట్ల పతనం: 1–10, 2–147. బౌలింగ్: బెనెట్ 2–0–22–0, ముజరబాని 4–1–30–1, చటారా 4–0–38–0, సికందర్ రజా 3–0–34–0, జోంగ్వి 4–0–53–0, మైర్స్ 1–0–28–0, మసకద్జా 2–0–29–1.
జింబాబ్వే ఇన్నింగ్స్: ఇన్నోసెంట్ కాయా (బి) ముకేశ్ కుమార్ 4; మధెవెరె (బి) రవి బిష్ణోయ్ 43; బెనెట్ (బి) ముకేశ్ కుమార్ 26; మైర్స్ (సి) రింకూ సింగ్ (బి) అవేశ్ ఖాన్ 0; సికందర్ రజా (సి) ధ్రువ్ జురేల్ (బి) అవేశ్ ఖాన్ 4; క్యాంప్‌బెల్ (సి) రవి బిష్ణోయ్ (బి) సుందర్ 10; మదాండె (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 0; మసకద్జా (రనౌట్) 1; జోంగ్వి (సి) రుతురాజ్ (బి) ముకేశ్ కుమార్ 33; ముజరబాని (సి) సుందర్ (బి) అవేశ్ ఖాన్ 2; చటారా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 134. వికెట్ల పతనం: 1–4, 2–40, 3–41, 4–46, 5–72, 6–73, 7–76, 8–117, 9–123, 10–134. బౌలింగ్: ముకేశ్ 3.4–0– 37–3, అభిషేక్ శర్మ 3–0–36–0, అవేశ్ 3–0– 15–3, రవి బిష్ణోయ్ 4–0–11–2, వాషింగ్టన్ సుందర్ 4–0– 28–1, పరాగ్ 1–0–5–0.
Comments
Please login to add a commentAdd a comment