ఐపీఎల్ 2024 విన్నింగ్ కెప్టెన్ (కేకేఆర్) శ్రేయస్ అయ్యర్ జులై, ఆగస్ట్ నెలల్లో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది. వివిధ కారణాల చేత టీ20 వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక కాని శ్రేయస్.. లంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని సమాచారం.
మరోవైపు ఐపీఎల్ 2024 హీరోలు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి, విజయ్‌కుమార్ వైశాఖ్, యశ్ దయాల్ జులై 6 నుంచి జింబాబ్వేతో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఎంపికయ్యే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరందరూ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.
వీరితో పాటు టీ20 వరల్డ్‌కప్‌కు ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా ఎంపికైన శుభ్‌మన్ గిల్, ఆవేశ్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ కూడా జింబాబ్వే సిరీస్‌కు ఎంపికవుతారని తెలుస్తుంది. జింబాబ్వే పర్యటనకు హార్దిక్ పాండ్యా కెప్టెన్, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికవుతారని ప్రచారం జరుగుతుంది.
జింబాబ్వే సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా లాంటి సీనియర్లకు విశ్రాంతినిస్తారని సమాచారం. జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును వచ్చే వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024తో బిజీగా ఉంది. మెగా టోర్నీలో భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. సూపర్-8లో టీమిండియా.. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment