టీమిండియాలో మోస్ట్ అన్ లక్కీ క్రికెటర్‌గా సంజూ శాంసన్‌కు పేరుంది. ఈ విషయాన్ని అతను మరోసారి నిరూపించాడు. శుభ్‌మన్ గిల్‌కు మెడ పట్టేయడంతో శ్రీలంకతో రెండో టీ20లో అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన సంజూ.. ఈ మ్యాచ్‌లో తానెదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డై అందరినీ నిరాశపరిచాడు. సంజూ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో నెటిజన్లు అతన్ని ఘోరంగా ఆడుకుంటున్నారు.
— hiri_azam (@HiriAzam) July 28, 2024
అవకాశాలు రాకపోతే ఇవ్వలేదంటారు.. వస్తే ఇలా చేస్తాడంటూ కామెంట్లు చేస్తున్నారు. సంజూ గోల్డెన్ డకౌటైన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఈ మ్యాచ్‌లో సంజూ మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (53) అర్ద సెంచరీతో రాణించగా.. పథుమ్ నిస్సంక (32), కమిందు మెండిస్ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
శ్రీలంక చివరి ఏడు వికెట్లు 31 పరుగుల వ్యవధిలో కోల్పోయి భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. రవి బిష్ణోయ్ (4-0-26-3), అర్ష్‌దీప్ సింగ్ (3-0-24-2), అక్షర్ పటేల్ (4-0-30-2), హార్దిక్ పాండ్యా (2-0-23-2) లంకేయులను భారీగా దెబ్బేశారు.
అనంతరం భారత్ ఛేదనకు దిగే సమయానికి వర్షం మొదలైంది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించారు. ఛేదనలో భారత్ ఆదిలోనే సంజూ శాంసన్ వికెట్ కోల్పోయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేసింది. యశస్వి జైస్వాల్ (15 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (12 బంతుల్లో 26; 4 ఫోర్లు, సిక్స్), హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపించారు.
ఆఖర్లో హార్దిక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస బౌండరీలు, సిక్సర్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. బంతితో రాణించిన హార్దిక్ బ్యాట్‌తోనూ చెలరేగాడు. ఫలితంగా భారత్ 6.3 ఓవరల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది (3 వికెట్ల నష్టానికి). ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 రేపు (జులై 30) జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment