పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరగాల్సిన రెండో టీ20లో భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ 45 నిమిషాలు ఆలస్యమైంది. ఈ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక చెరో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. లంక తరఫున దిల్షన్ మధుషంక స్థానంలో రమేశ్ మెండిస్.. భారత్ తరఫున శుభ్‌మన్ గిల్ స్థానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చారు. గిల్ మెడ పట్టేయడంతో ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. భారతకాలమానం ప్రకారం రాత్రి 7:45 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిన్న జరిగిన తొలి టీ20లో టీమిండియా 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో టీ20 ఇదే వేదికగా జులై 30న జరుగనుంది.
తుది జట్లు..
భారత్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్
శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుసల్ మెండిస్(వికెట్‌కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్), దసున్ షనక, వనిందు హసరంగ, రమేష్ మెండిస్, మహేశ్ తీక్షణ, మతీష పతిరణ, అసిత ఫెర్నాండో
Comments
Please login to add a commentAdd a comment