దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిశాక భారీ వర్షం
సాధ్యపడని భారత ఇన్నింగ్స్
చెన్నై: భారీ వర్షం కారణంగా భారత్, దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్ల మధ్య ఆదివారం రెండో టి20 మ్యాచ్ రద్దయింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు సాధించింది. తజీ్మన్ బ్రిట్స్ (39 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్), అనెక్ బోష్ (32 బంతుల్లో 40; 6 ఫోర్లు) రాణించారు.
భారత బౌలర్లలో పూజా వస్త్రకర్, దీప్తి శర్మ రెండు వికెట్ల చొప్పున తీశారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగియగానే వర్షం మొదలైంది. రాత్రి 10 దాటినా వాన తగ్గుముఖం పట్టకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలి టి20లో నెగ్గిన దక్షిణాఫ్రికా 1–0తో ఆధిక్యంలో ఉంది. చివరిదైన మూడో టి20 మ్యాచ్ మంగళవారం జరుగుతుంది.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: లౌరా వొల్‌వార్ట్ (సి) రాధా యాదవ్ (బి) పూజా వస్త్రకర్ 22; తజీ్మన్ బ్రిట్స్ (స్టంప్డ్) ఉమా ఛెత్రి (బి) దీప్తి 52; మరిజన్ కాప్ (సి) సజన (బి) దీప్తి శర్మ 20; అనెక్ బోష్ (బి) శ్రేయాంక 40; చోల్ టైరన్ (సి అండ్ బి) రాధా యాదవ్ 12; నదినె డి క్లెర్క్ (సి) సజన (బి) పూజా వస్త్రకర్ 14; డెర్సెక్సన్ (నాటౌట్) 12; ఎలీజ్ మార్క్స్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–43, 2–75, 3–113, 4–131, 5–164, 6–164.
బౌలింగ్: పూజా వస్త్రకర్ 4–0–37–2, సజన సజీవన్ 1–0–13–0, అరుంధతి రెడ్డి 4–0–37–0, శ్రేయాంక పాటిల్ 4–0–37–1, రాధా యాదవ్ 3–0–31–1, దీప్తి శర్మ 4–0–20–2.
Comments
Please login to add a commentAdd a comment